`సుప్రీమ్` హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా `నేను శైలజ` ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `చిత్రలహరి`. కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అక్టోబర్‌లో లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటివరకు 80 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముంబైలోని మెరీన్ డ్రైవ్‌లో జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఐదు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. `సుప్రీమ్` తరువాత సరైన విజయం లేని… సాయిధరమ్‌కు ఈ సినిమా విజయం కీలకంగా మారింది. `చిత్రలహరి`తో సాయిధరమ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడని ఆశిద్దాం.
[youtube_video videoid=03Mk3HEzRdM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: