గత ఏడాది వేసవికి `నా పేరు సూర్య`తో పలకరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… దాదాపు ఏడాది గ్యాప్ తరువాత తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా… ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మార్చిలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ ప్రాజెక్ట్… ఆరేడు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుని దసరా సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమా తరువాత బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ గురించి ఫిల్మ్‌నగర్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పాన్-ఇండియా డైరెక్టర్‌గా ఇమేజ్ ఉన్న తమిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో బన్నీ తన నెక్ట్స్ ఫిల్మ్ చేసే అవకాశముందని టాలీవుడ్ టాక్. ఓ పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్‌తో మురుగదాస్ ఓ చిత్రం చేస్తున్నాడు. అది పూర్తయ్యేలోపే… బన్నీ, మురుగదాస్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ రావచ్చు. మెగా కాంపౌండ్‌లో ఇదివరకు మెగాస్టార్ చిరంజీవితో మురుగదాస్ `స్టాలిన్` (2006) చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఆ ఫ్యామిలీ హీరోతో మురుగదాస్ సినిమా చేయనుండడం విశేషమనే చెప్పాలి.
[youtube_video videoid=zOb1usWzAfw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: