ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. మహానటి, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇలా పలువురి బయోపిక్ లు తెరకెక్కాయి..తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు మరో ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్ తెరపైకి వచ్చింది. అది అల్లూరి సీతారామరాజు. మన్యం వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సునీల్ దర్శకత్వంలో రిసాలి ఫిల్మ్‌స్టూడియో అండ్ అకాడమీ బ్యానర్‌పై శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఆ సినిమా షూటింగ్ ను మార్చి నుండి ప్రారంభించి..ఆగష్టు లో సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అంతేకాదు సినిమా మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలు విశాఖ, కాకినాడ, రాజమండిలో చిత్రీకరించనున్నట్టు చిత్ర నిర్మాతలు తెలుపుతున్నారు. ఇక ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
మరి 1974లో సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమాలో నటించి ఎంత అద్భుతమైన నటనను కనబరిచారో అందరికీ తెలుసు. అల్లూరి పాత్రకు ప్రాణం పోశారు కృష్ణ. ఇప్పుడు ఈ బయోపిక్ లో అల్లూరి సీతారామరాజుగా ఎవరు కనిపిస్తోరో చూడాలి.
[youtube_video videoid=LlHI_pFQSOA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: