పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ , ఛార్మి కౌర్) నిర్మాణ సారధ్యంలో పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఇస్మార్ట్ శంకర్ మూవీ షూటింగ్ జనవరి 24వ తేదీ ప్రారంభమయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో జరుగుతున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ లో హీరో రామ్, ఇతరులతో యాక్షన్ సీన్స్ ను పూరి జగన్నాథ్ చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ లో పవర్ ఫుల్ విలన్ గా బాలీవుడ్ నటుడు సుధాంశు పాండే నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రలలో సత్యదేవ్, పునీత్ ఇస్సార్, ఆశీష్ విద్యార్థి నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇస్మార్ట్ శంకర్ మూవీ లో రామ్ కు జంటగా నన్ను దోచుకుందువటే మూవీ తో టాలీవుడ్ కు పరిచయమయిన నభా నటేష్ నటిస్తున్నారు. పక్కా హైదరాబాదీ గా, మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్న నభా నటేష్ మార్చి నెలలో ఇస్మార్ట్ శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్న ఇస్మార్ట్ శంకర్ మూవీ లో మరొక హీరోయిన్ గా సవ్యసాచి, Mr.మజ్ను సినిమాలలో నటించిన నిధి అగర్వాల్ సెలెక్ట్ అయ్యారు. ఈ మూవీ లో నిధి అగర్వాల్ డాక్టర్ పాత్రలో నటించనున్నారని సమాచారం.
[youtube_video videoid=nrQgHxNKrcQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: