ఒమర్ లులు దర్శకత్వంలో స్టూడెంట్స్ నేపధ్యం లో మలయాళ మూవీ ఒరు ఆదార్ లవ్ రూపొందింది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లవర్స్ డే ను సుఖీభవ బ్యానర్ పై గురురాజ్, వినోద్ రెడ్డి నిర్మించారు. ఒరు ఆదార్ లవ్ మూవీ రెండు వెర్షన్ లు ఫిబ్రవరి 14 వ తేదీ వేలంటైన్స్ డే రోజున రిలీజ్ కానున్నాయి. షాన్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ మూవీ ద్వారా ప్రియా ప్రకాష్ వారియర్ మల్లువుడ్ కు
పరిచయమవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒరు ఆదార్ లవ్ మూవీ లోని ఒక సాంగ్ సన్నివేశం లో ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుగీటి, సెన్సేషన్ క్రియేట్ చేసి ఓవర్ నైట్ సెలబ్రిటీ గా మారారు. ఆ సన్నివేశం తో ప్రియా ప్రకాష్ ఒరు ఆదార్ లవ్ సినిమా పై అంచనాలు పెంచేశారు. లవర్స్ డే మూవీ ఆడియో లాంచ్ జనవరి 23వ తేదీ JRC కన్వెన్షన్, ఫిల్మ్ నగర్ లో జరుగనుంది. ఈ ఈవెంట్ కు మలయాళ భాషలో కూడా క్రేజ్ ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక అతిధి గా పాల్గొంటున్నారు. ఈ విషయం చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.
[youtube_video videoid=dLEx-QmTgI4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: