సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నుంచి వచ్చిన సినిమాలే కాదు… అందులోని పాటలు కూడా సంచలనమే. ముఖ్యంగా… ఆర్జీవీ కెరీర్ ఆరంభంలో పలు చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలచాయి. ఆ చిత్రాలలో `గోవిందా గోవింద` ఒకటి. రాజ్ – కోటి స్వరసారధ్యంలో రూపొందిన ఐదు పాటలూ ఆ రోజుల్లో కుర్రకారుని ఉర్రూతలూగించాయి. `అందమా అందుమా`, `అమ్మ బ్రహ్మ దేవుడో`, `ఇందిర మందిర`, `ఓ నవీనా`, `ప్రేమంటే ఇదంటూ`… ఇలా ప్రతీ పాట ఓ సంచలనమే. `శివ`, `అంతం` తరువాత నాగార్జున కాంబినేషన్‌లోనూ… `క్షణక్షణం` తరువాత శ్రీదేవి కాంబినేషన్‌లో రామ్ గోపాల్ వర్మ రూపొందించిన చిత్రమిది. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో పరేష్ రావల్, కోట శ్రీనివాసరావు, గుమ్మడి, అరుణ్ గోవిల్, జె.వి.సోమయాజులు, ఉత్తేజ్, సూర్యకాంతం, మాస్టర్ అనిల్ రాజ్, సిల్క్ స్మిత (ప్రత్యేక గీతం) ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. 1993 జనవరి 21న విడుదలైన `గోవిందా గోవింద`… నేటితో 25 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=LVsE_Ge_AGo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: