`జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి రెండు విజయవంతమైన చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్‌మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన నూతన సంవత్సరం సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. కాగా… ఈ నెలలోనే పూజా కార్యక్రమాలను నిర్వహించి… ఫిబ్రవరి రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టనున్నారని సమాచారం. అలాగే… దసరా కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట. గత ఏడాది విజయదశమికి త్రివిక్రమ్ రూపొందించిన `అరవింద సమేత` విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… మళ్ళీ అదే సీజన్‌లో రానున్న ఈ సినిమా కూడా త్రివిక్రమ్‌కి మరో సూపర్‌హిట్‌ను అందిస్తుందేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=o1cPWuceEJg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: