`ఖాకి` వంటి ఘనవిజయం తరువాత యువ కథానాయకుడు కార్తి, అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `దేవ్` పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా రజత్ రవిశంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు హేరిస్ జైరాజ్ స్వరాలు అందిస్తున్నాడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా… ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ బిజినెస్ విమెన్ పాత్రలో కనిపించనుండగా… కార్తి అడ్వెంచరర్ క్యారెక్టర్ లో దర్శనమివ్వనున్నాడు. రెండు విభిన్న మనస్తత్వాలు ఉన్న హీరోహీరోయిన్లు ప్రేమలో పడ్డాక ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథాంశం అని సమాచారం. రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, కార్తిక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాతో… కార్తి, రకుల్ జంట మరో హిట్‌ను తమ ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=5seXIWYZW7M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: