లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్

ఒక అరుంధతి చేయాలన్నా.. దేవసేన చేయాలన్నా.. రుద్రమదేవి చేయాలన్నా.. భాగమతి చేయలన్నా ఒకే ఒక్క హీరోయిన్ వల్ల అవుతుంది. ఆమె ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా.. వన్ అండ్ ఓన్లీ అనుష్క. అందం, అభినయం ఉండి లక్ లేకపోయినా.. లక్ ఉండి మిగిలిన రెండూ లేకపోయినా కష్టమే.. కానీ అందం, అభినయం తో పాటు లక్ కూడా వున్న హీరోయిన్ అనుష్క. అయితే తొలినాళ్లలో అనుష్క కూడా పలు ప్లాప్స్ మూటగట్టుకుందనుకోండి. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ స్టార్ హీరోయిన్ గా.. తన కోసం స్టోరీ లు రాసి సినిమా తీసే అంత స్థాయికి ఎదిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన అనుష్కను పూరీ జగన్నాథ్ మొదటగా వెండితెరకు పరిచయం చేసాడు. అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ, తన గ్లామర్ తో బాగానే ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత ఆమె సుమంత్ సరసన మహానంది సినిమాలో నటించారు, ఆ సినిమా కూడా పెద్దగా కాలేదు. ఇక ఆ తరువాత రవితేజ, రాజమౌళి ల కాంబినేషన్లో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అనుష్క, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో, హీరోయిన్ గా తొలి విజయాన్ని అందుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న అనుష్క కెరీర్ 2009 లో వచ్చిన అరుంధతి సినిమాతో మారిపోయింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడొస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మొదట బీజం వేసింది ఈ సినిమానే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ఎన్ని అవార్డులు సొంతం చేసుకుందో చెప్పడం కష్టమే. ఆ ఏడాది ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ సినిమాకే వచ్చేసాయి. ఈ సినిమాతో ఉత్తమ నటిగా నంది అవార్డుతో పాటు ఫిల్మ్ ఫేర్, సినీ మా అవార్డ్, సంతోషం అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.

ఇవన్నీ ఒక ఏతైతే వేదం సినిమాలోని ‘సరోజ’ రోల్ మరో ఎత్తు. ఒక స్టార్ హీరోయిన్ గా వున్నప్పుడు ఇలాంటి పాత్రాలు చేయడానికి ఏ హీరోయిన్ కూడా అంత దైర్యంగా ఈ సినిమా చేయడానికి ముందుకు రాదు. కానీ అనుష్క మాత్రం సరోజ రోల్ ను ఛాలెంజింగ్ గా తీసుకొని నటించింది. ఈ సినిమాతో తన నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. సింగం, మిర్చి, సింగం 2, బాహుబలి లాంటి ఎన్నో సినిమాలతో తిరుగులేని హీరోయిన్ అయిపోయారు అనుష్క. బాహుబాలి సినిమాతో అయితే దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. తన 14 ఏళ్ళ కెరీర్ లో ఎలాంటి విమర్శలు తెచ్చుకోకుండా.. తన ముద్దు పేరు స్వీటీ లాగానే.. అనుష్క అంటే స్వీట్ అన్న పేరు తెచ్చుకుంది. అంతగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఈ దశాబ్ధ కాలంలో దక్షిణాది ఇండస్ట్రీలో మరొకరు లేరంటే ఆశ్చర్యం లేదు.. అతిశయోక్తి కాదు.

మరి ఎప్పుడూ విభిన్నతను కోరుకొనే అనుష్క భాగమతి సినిమా తర్వాత గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘నిశ్శబ్దం’ తో వస్తుంది. ఈ సినిమాలో ఆమె దివ్యంగురాలిగా నటిస్తుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాను తెలుగు లో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ రోజు అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని.. మంచి మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − fifteen =