క్రిస్మస్ రిలీజ్ కన్ఫ్యూషన్ లో సినిమాలు

Confusion Continues on Christmas Movie Releases,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Christmas 2019 Movie Releases,new Telugu movie releases christmas 2019,Tollywood Movies 2019

దసరా సీజన్ అయిపోయింది.. ఈ సీజన్ లో రావాల్సిన సినిమాలు అన్నీ వచ్చేసాయి. ఇక ఈ ఏడాదికి మిగిలింది ఒక్క పండగే అది క్రిస్మస్. ఈ ఏడాది చివర్లో వచ్చే ఈ పండగకు పలు సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఈ ఫెస్టివల్ కు డజను పైగా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు ముందు క్రిస్మస్ కు రావడానికి ప్లాన్ చేసుకున్నా ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చుకోనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక్క మారుతి- సాయి తేజ్ కాంబినేషన్ లో వస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ సినిమా మాత్రమే ఇప్పటివరకూ రిలీజ్ డేట్ ను కన్ఫార్మ్ చేసుకుంది. ఈ సినిమాను క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో సాయి తేజ్ హీరో సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రతి రోజూ పండగే సినిమా తో పాటు బాలయ్య కూడా తన సినిమాను డిసెంబర్ లోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 20 నుండి 25లోపులోనే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయనున్నారట చిత్రయూనిట్.

ఈ ఒక్క సినిమా తప్పించి అన్ని సినిమాల రిలీజ్ డేట్లు ఇంకా ఫిక్స్ కాలేదు.. కొన్ని సినిమాలైతే ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాయి. సంక్రాంతి కి మరో నాలుగు సినిమాలు లైన్ లో ఇప్పటికే ఉన్నాయి. ఈ కారణం వల్ల క్రిస్మస్ కు రిలీజ్ చేయాలా..? సంక్రాంతికి రిలీజ్ చేయాలా? లేక ఇదేం లేకుండా ఈ పోటీ తో సంబంధం లేకుండా చిన్నగా రిలీజ్ చేయాలా? అన్న ఆలోచనలో పడ్డారు.

ముందుగా బాబి డైరెక్షన్ లో మామ అల్లుళ్ళు వెంకీ-చై కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా వెంకీ మామ రిలీజ్ డేట్ విషయం లో కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. క్రిస్మస్ కా సంక్రాంతి రావాలా అని అటూ ఇటూ ఊగుతోంది. ఎప్పటి నుండో ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇక నితిన్ – వెంకీ కుడుముల దర్శకత్వంలో రానున్న భీష్మ ఇప్పటికే క్రిస్మస్ రేసు నుండి వెనక్కి తగ్గింది. క్రిస్మస్ రేస్ నుండి తప్పుకొని ఆఖరికి సంక్రాంతిని కూడా స్కిప్ చేసి ఫిబ్రవరిలో రావడానికి ప్లాన్ చేస్తుంది. ఇక క్రిస్మస్ కు రావాలనుకున్న ‘డిస్కో రాజా’ సినిమా కూడా వెనక్కి తగ్గింది. రవితేజ – విఐ ఆనంద్ దర్శకత్వంలో రానున్న డిస్కో రాజా చిత్రానికి ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ పనులు బ్యాలెన్స్ ఉండడంతో ఆ సమయానికి రావడం కష్టమే. అందుకే సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండటంతో ‘డిస్కో రాజా’ కూడా ఫిబ్రవరి కి వాయిదాపడనున్నట్టు తెలుస్తుంది. వీటితోపాటు 96 రీమేక్ రిలీజ్ పై కూడా ఇంకా క్లారిటీ రాలేదు.

మరి చూద్దాం ఏ ఏ సినిమాలు ఎప్పుడు రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకుంటాయి. వీటిపై ఓ క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 18 =