లేడీ సూపర్ స్టార్ నయనతార టాలీవుడ్, కోలీవుడ్ లలో అగ్ర తారగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ తోపాటు, కమర్షియల్ చిత్రాలలో నటిస్తున్న నయనతార నటించిన మూవీస్ 2019 సంవత్సరంలో ఇప్పటివరకు 6 మూవీస్ రిలీజయ్యాయి.తమిళం లో విశ్వాసం, తెలుగు లో సైరా నరసింహా రెడ్డి, మలయాళంలో లవ్ యాక్షన్ డ్రామా మూవీస్ ఘనవిజయం సాధించాయి. దళపతి విజయ్ తో నటించిన బిగిల్ దీపావళికి రిలీజ్ కానుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో నటించిన దర్బార్ మూవీ జనవరి లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అజిత్ కుమార్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ నెర్కొండ పార్వై దర్శకుడు H. వినోద్ దర్శకత్వంలో , బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మాణ సారథ్యం లో ఒక మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో హీరోయిన్ గా నయనతార ను సంప్రదించినట్టు, నయనతార సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అజిత్ కుమార్, నయనతార జంటగా నటించిన బిల్లా , ఏగన్, అర్రంబం, విశ్వాసం మూవీస్ ఘన విజయం సాధించాయి. నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే వారి కాంబినేషన్ లో 5వ మూవీ అవుతుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: