మొత్తానికి ఈ ఏడాది ఇప్పటివరకు పలు సినిమాలు విడుదలై సినీ ప్రేక్షకులను సందడి చేశాయి. ఇక దసరా పండగ హడావుడి కూడా అయిపోయింది. ఇక ఈ పండుగకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న సినిమాలు రిలీజ్ అయిపోయాయి. వచ్చేది దీపావళి పండగ.. అయితే ఈ పండుగకు పెద్దగా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా లేవు. వచ్చేది సంక్రాంతి సీజన్. సంక్రాంతి సీజన్ కు ఎక్కువగా పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతాయి. ఈ పెద్ద పండగకు ఇప్పటికే మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ రజినీ ‘దర్బార్’ సినిమాలు ఇలా పెద్ద పెద్ద సినిమాలు అన్నీ సంక్రాంతికి స్లాట్స్ బుక్ చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దీపావళికి సంక్రాంతికి మధ్య ఉన్న పండగ క్రిస్మస్. ఇక ఈ పండుగకు కూడా పలు సినిమాలు ప్రేక్షకులను సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సినిమాలు ఈ క్రిస్మస్ ను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన ‘వెంకీమామ’ సినిమా, రవితేజ ‘డిస్కో రాజా’, సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే’, నితిన్ ‘భీష్మ‘ చిత్రాలు క్రిస్మస్ కు వస్తున్నట్లు ప్రకటించాయి. అనుష్క ‘నిశ్శబ్దం’ కూడా ఈ సీజన్ నే టార్గెట్ చేస్తోందిట. వీటితో పాటు బాలయ్య బాబు, కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కూడా క్రిస్మన్ లోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలు రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. కానీ ఈ సినిమాలను మాత్రం క్రిస్మస్ పండుగకే రంగంలోకి దిగటానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. మరి వీటిలో ఫైనల్ గా రేస్ లో మిగిలేది ఎన్ని సినిమాలో.. వాటిలో ఎన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవుతాయో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: