తెలుగులో రొటీన్ కు భిన్నంగా సినిమాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు రవిబాబు. తాజాగా మరో విభిన్నమైన కథతో వస్తున్నాడు.’స్పాట్ స్పిరిట్’ అనే కొత్త కాన్సెప్ట్ తో ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ‘ఆవిరి’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని భయపెట్టనున్నాడు. టైటిల్‌తోనే సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసాడు రవిబాబు. అంతేకాదు టీజర్ తో ఆ అంచనాలను మరింత పెంచేసాడు రవిబాబు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో రవిబాబు, నేహా చౌహాన్, భరణి శంకర్, ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణ లో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు… సంగీతం వైధ్య అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కూడా త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అన్ని పనులు త్వరలో పూర్తిచేసి నవంబర్ 1వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నాడు రవిబాబు.
గతంలో లడ్డు బాబు, అవును 2, అదుగో సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో…. ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలి అని చూస్తున్నాడు రవిబాబు. మరి చూద్దాం ‘ఆవిరి‘ సినిమా రవిబాబుకు ఎంత సక్సెస్ తెచ్చిపెడుతుందో.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: