య‌న్టీఆర్ న‌ట విశ్వ‌రూపం ‘కొండవీటి సింహం’కు 38 ఏళ్ళు

మహానటుడు యన్.టి.రామారావు, అతిలోకసుందరి శ్రీదేవి జంటగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించారు. వాటిలో ‘కొండవీటి సింహం’ ఒక‌టి. యన్టీఆర్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన‌ ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ముఖ్యంగా ఎస్.పి.రంజిత్‌కుమార్‌గా యన్టీఆర్ నట విశ్వరూపాన్ని ప్ర‌ద‌ర్శించారు. య‌న్టీఆర్‌కు జోడీగా శ్రీదేవి, జయంతి నటించగా… మోహన్‌బాబు, సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, నగేష్, కాంతారావు, ముక్కామల, చలపతిరావు, గీత, పుష్పలత, “మాస్టర్” హరీష్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. తమిళ చిత్రం ‘తంగ పతాకం’కు రీమేక్‌గా ‘కొండవీటి సింహం’ను రూపొందించారు దర్శకేంద్రుడు.

వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన పాటలకు చక్రవర్తి బాణీలు సమకూర్చారు. “ఈ మధుమాసంలో”, “అత్తమడుగు వాగులోన”, “పిల్ల ఉంది”, “బంగినపల్లి మామిడిపండు”, “వానొచ్చే వరదొచ్చే”, “గోతికాడ గుంటనక్క”, “మా ఇంటిలోన మహలక్ష్మి”… ఇలా చ‌క్ర‌వ‌ర్తి స్వ‌ర‌క‌ల్ప‌న‌లోని ప్ర‌తీ గీతం విశేషాద‌ర‌ణ పొందింది. రోజా మూవీస్ పతాకంపై ఎం.అర్జునరాజు, కె.శివరామరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1981 అక్టోబర్ 7న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలచిన ‘కొండవీటి సింహం’… నేటితో 38 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here