య‌న్టీఆర్ మ్యూజిక‌ల్ సెన్సేష‌న్‌ ‘భలే తమ్ముడు’కు 50 ఏళ్ళు

Best Sr NTR Movies All Time, Bhale Thammudu Movie Updates, Bhale Thammudu News, Bhale Thammudu Telugu Movie Latest News, Latest Telugu Movies News, List Of Sr NTR Movies, Sr NTR Bhale Thammudu Movie Completed 50 Years, Sr NTR Musical Hit Bhale Thammudu Completes 50 Years, Sr NTR Super Hit Movies, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

“యుగయుగాలకి, తరతరాలకి చెరిగిపోని అనుబంధం… అన్నదమ్ముల అనురాగబంధం”. అటువంటి బంధం చుట్టూ అల్లుకున్న జ‌న‌రంజ‌క చిత్రమే ‘భలేతమ్ముడు’. మహానటుడు నందమూరి తారక రామారావు ద్విపాత్రాభినయం చేసిన ఈ యాక్ష‌న్ క్రైమ్ ఫిల్మ్‌లో… కె.ఆర్.విజయ, విజయ గిరిజ కథానాయికలుగా నటించారు. రేలంగి, రాజనాల, ప్రభాకరరెడ్డి, మిక్కిలినేని, జూనియర్ శ్రీ‌రంజని, రమాప్రభ ముఖ్య భూమికలు పోషించగా… బాలీవుడ్ నటీమణి అరుణా ఇరాని ప్ర‌త్యేక గీతంలో నర్తించారు. హిందీ మూవీ ‘చీనా టౌన్’(1962)కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాను దర్శకులు బి.ఎ.సుబ్బారావు తెరకెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డా.సి.నారాయణరెడ్డి కలం నుంచి జాలువారిన పాటలకు… యన్టీఆర్ ఆస్థాన సంగీత దర్శకులు టి.వి.రాజు అందించిన‌ బాణీలు విశేషాదరణ పొందాయి. “ఎంతవారు గాని”, “నేడే ఈ నాడే”, “గోపాల బాల నిన్నే కోరి”, “ఇద్దరి మనసులు”, “బంగారు గువ్వను నేను” … ఇలా ప్ర‌తీ పాట నిత్య నూత‌న‌మే. ఈ సినిమాతో బాలీవుడ్ దిగ్గజ గాయకుడు మహమ్మద్ రఫీని తెలుగువారికి పరిచయం చేయ‌డ‌మే కాకుండా… పాటలన్నీ ఆయన చేతే పాడించారు దర్శకనిర్మాతలు. అప్పట్లో శతదినోత్సవం జరుపుకున్న ఈ చిత్రాన్ని… తారకరామ పిక్చర్స్ పతాకంపై అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మించారు. 1969 సెప్టెంబర్ 18న విడుదలై బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన ‘భలే తమ్ముడు’… నేటితో 50 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 11 =