పూరీ – విజయ్ ల ‘ఫైటర్ ‘

2019 Latest Telugu Film News, Vijay Deverakonda New Movie gets an Interesting Title, Vijay Deverakonda Latest Movie News, Interesting Title For Vijay Deverakonda, Vijay Deverakonda And Puri Movie gets A Title, Vijay Deverakonda New mmovie Titled As Fighter, Vijay Deverakonda and Puri's is Fighter, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News
Vijay Deverakonda New Movie gets an Interesting Title

రామ్ తో మంచి మాస్ మసాలా సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు పూరీ. కేవలం పూరీ కే కాదు.. రామ్ కి కూడా మంచి హిట్ ఇచ్చాడు. దీనితో మళ్ళీ పూరీ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు పూరీతో సినిమా చేయడానికి మళ్లీ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పూరీ ఏకంగా టాలీవుడ్ క్రేజీ హీరో అయిన విజయ్ దేవరకొండతో సినిమా చేసే అవకాశాన్ని కొట్టేసాడు. విజయ్ కోసం ఎంతోమంది లైన్ లో ఉండగా.. విజయ్ మాత్రం ఆ ఛాన్స్ ను డాషింగ్ డైరెక్టర్ కి ఇవ్వడం విశేషమే. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు వీరు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఫైటర్ అనే టైటిల్ ను ఈ సినిమాకు పెట్టాలని చూస్తున్నారట. మరి ఈ పేరు అయితే వినిపిస్తుంది. ఇదే ఫైనల్ చేశారా? లేక వేరే ఇంకేదైనా పెడతారా అన్న విషయం తెలియాలంటే మాత్రం అధికారికంగా ప్రకటించేంత వరకూ ఆగాల్సిందే.

కాగా పూరీ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్.. ఇంకా నటీ నటులను ఎంపిక చేసే పనిలో వున్నారు. ప్రస్తుతం విజయ్ చేతిలో సినిమాలు వున్న నేపద్యంలో నవంబర్ నుండి షూటింగ్ ప్రారంభించి.. 2020 ఫిబ్రవరి లో రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు. మరి ఈ క్రేజీ కంబినేషన్లో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. మరి చూద్దాం వీరి సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =