ఢిల్లీ వెళ్ళ‌నున్న‌ `డిస్కో రాజా`

Disco Raja Movie Delhi Schedule Latest Updates,Telugu Filmnagar,Telugu Film News 2019,Telugu Cinema Updates,Latest Telugu Movie News,Disco Raja Movie Updates,Disco Raja Telugu Movie Latest News,Ravi Teja Disco Raja Movie New Schedule Updates,Disco Raja Movie Shooting Latest News,Disco Raja Telugu Movie Shooting Latest Updates
Disco Raja Movie Delhi Schedule Latest Updates

మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `డిస్కో రాజా`. పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేష్‌, తాన్యా హోప్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని వీఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తుండ‌గా… రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నాడు. పిరియాడిక‌ల్ ట‌చ్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ర‌వితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. అంతేకాదు… ఒక పాత్ర కోసం డిస్కో డాన్స‌ర్‌గా సంద‌డి చేయ‌నున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ అన్న‌పూర్ణ ఏడెక‌రాల‌లో రూ.1.2 కోట్ల‌తో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో జ‌రుగుతోంది. అక్క‌డ ర‌వితేజ‌, తాన్యా హోప్‌, `వెన్నెల‌` కిషోర్ పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ నెల 26 వ‌ర‌కు ఈ షెడ్యూల్ సాగుతుంది. అనంతరం ఆగ‌స్టు మొద‌టి వారం నుంచి ఢిల్లీలో `డిస్కో రాజా` నెక్ట్స్ షెడ్యూల్ జ‌రుగనుంది. ఈ షెడ్యూల్ లో `ఇస్మార్ట్‌` బ్యూటీ న‌భా న‌టేష్ కూడా జాయిన్ కానుంది. ఆపై చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ జ‌రిపి… ఈ ఏడాది చివ‌ర‌లో ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి సంగీతం: త‌మ‌న్‌.

[subscribe]

[youtube_video videoid=otdGhg81P4M]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 8 =