బిగ్ బాస్ 3 పోస్ట్ పోన్ కానుందా ?

2019 Latest Telugu Movie News, Bigg Boss 3 Postponed? Details Inside, Bigg Boss 3 Telugu harassment allegations, Bigg Boss Telugu 3 Latest updates, Bigg Boss Telugu 3 Postponed Over Harassment Controversy, Bigg Boss Telugu season 3 to be postponed, Nagarjuna wants Bigg Boss Telugu 3 to be postponed, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Bigg Boss 3 Postponed? Details Inside
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 2 ను హీరో నాని రసవత్తరంగా నడిపారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 కి కింగ్ నాగార్జున హోస్ట్. జులై 21 వ తేదీ నుండి ప్రసారం కానుంది. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్త సెక్సువల్ హెరాస్ మెంట్, మోసం గురించి ఆ షో నిర్మాతలపై ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితులలో బిగ్ బాస్ 3 ప్రోగ్రామ్ ను కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయాల్సిందిగా నాగార్జున నిర్మాతలను కోరారు. బిగ్ బాస్ 3 షో లో సెలెక్ట్ చేయడానికి జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి ని సెక్సువల్ ఫేవర్ అడగడంతో ఆ షో నిర్మాతలపై శ్వేతారెడ్డి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేస్ ఫైల్ చేశారు. ACP KS రావు 4 మెంబర్స్ పై కేస్ ఫైల్ అయిందని, విచారణ జరుగుతుందని తెలిపారు. బిగ్ బాస్ 3 షో లో సెలెక్ట్ అయ్యానని, 100 రోజులు ఆ షో లో పాల్గొనడానికి అగ్రిమెంట్ అయ్యిందని, కొన్ని మూవీస్ ను రిజెక్ట్ చేయడంతో ఆర్ధికంగా నష్టపోయానని, 100 రోజులు సెక్స్ లో పాల్గొనకుండా ఉండగలరా, బిగ్ బాస్ ను ఇంప్రెస్ చేయాలని తనను అడిగినట్టుగా నటి గాయత్రి గుప్త నిర్మాతలపై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల వలన బిగ్ బాస్ 3 షో పై బుల్లితెర ప్రేక్షకులకు నెగటివ్ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది అందువలన ఆ షో ను పోస్ట్ పోన్ చేయడమే శ్రేయస్కరం.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=eEda8i4LB88]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =