రాజ‌మౌళి ‘ఈగ’కు 7 ఏళ్ళు

2019 Telugu Full Movies,7 Years For SS Rajamouli Eega Movie, 7 Years Completed Eega Telugu Movie, 7 Years For Eega Movie, 7 years Of Eega, Latest Tollywood Movie Updates,Eega Telugu Movie, Telugu Movies News 2019, Rajamouli Eega Movie , Rajamouli Latest Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
7 Years For SS Rajamouli Eega Movie

ఎస్.ఎస్.రాజమౌళి… తెలుగు సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్ళిన అగ్రశ్రేణి ద‌ర్శ‌కుడు. తొలి చిత్రం ‘స్టూడెంట్ నెం:1’ నుంచి గత చిత్రం ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ వరకు ఈ ద‌ర్శ‌క‌ధీరుడు తెర‌కెక్కించిన ప్ర‌తీ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ బాట ప‌ట్ట‌డం విశేషం. వాటిలో ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిన ‘ఈగ’ ఒకటి. నేచురల్ స్టార్ నాని, సక్సెస్‌ఫుల్ హీరోయిన్ సమంత , క‌న్న‌డ న‌టుడు ‘కిచ్చా’ సుదీప్ ప్రధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాలో ఆదిత్య, తాగుబోతు రమేష్, శ్రీనివాస రెడ్డి, దేవ‌ద‌ర్శిని, హంసానందిని తదితరులు ఇతర ముఖ్య భూమిక‌లు పోషించారు.

స్వ‌ర‌వాణి కీరవాణి బాణీలు స‌మ‌కూర్చిన ఈ చిత్రం…. ప‌లు ప్రాంతీయ‌, జాతీయ పుర‌స్కారాల‌ను సొంతం చేసుకుంది. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా… త‌మిళంలో `నాన్ ఈ` పేరుతో విడుద‌లై అక్కడా విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేసింది. 2012 జూలై 6న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిల‌చిన‌ ‘ఈగ’… నేటితో ఏడు వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here