చిరంజీవి ‘పునాదిరాళ్ళు’కు 40 ఏళ్ళు

#Punadhirallu, 2019 Latest Telugu Movie News, 40 Years For Chiranjeevi Punadhirallu, 40 Years For Punadhirallu Telugu Movie, Latest Telugu Movies News, Megastar Chiranjeevi Punadhirallu Movie Completed 40 Years, Punadhirallu Movie Updates, Punadhirallu Telugu Movie Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
40 Years For Chiranjeevi Punadhirallu

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌కు పునాదిగా నిల‌చిన చిత్రం ‘పునాదిరాళ్ళు’. కొణిదెల శివశంకర వరప్రసాద్‌ను కాస్త చిరంజీవిగా మార్చి కాల‌క్ర‌మంలో మెగాస్టార్ స్థాయికి తీసుకెళ్ళడానికి దోహదపడిన సినిమా ఇది. నరసింహరాజు హీరోగా నటించిన ఈ చిత్రంలో… హీరో స్నేహితుల్లో ఒకడిగా ముఖ్య పాత్రను పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు చిరు. కవిత, గోకిన రామారావు, రోజారమణి, సావిత్రి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి గూడపాటి రాజ్‌కుమార్ దర్శకత్వం వ‌హించాడు. ఎస్.ప్రేమ్‌జీ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలలో “కార్మిక కర్షక”, “ఏ పల్లె ఏ వాడ” వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని చందన్ సిగార్ వర్క్స్ ఎస్.అబ్దుల్ ఖాదర్ సమర్పించగా… ధర్మ విజయ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఫజులుల్లాహక్ నిర్మించారు. 1979 జూన్ 21న విడుదలైన ‘పునాదిరాళ్ళు’… నేటితో 40 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘పునాదిరాళ్ళు’ – కొన్ని విశేషాలు:
* చిరంజీవి తొలిసారి మేక‌ప్ వేసుకున్న సినిమా ‘పునాదిరాళ్ళు’ అయినా ‘ప్రాణం ఖరీదు’ ముందుగా తెర‌పైకొచ్చింది. మ‌రో ఐదు సినిమాల త‌రువాత అంటే ఏడవ చిత్రంగా ‘పునాది రాళ్ళు’ రిలీజ్ కావ‌డం విశేషం.
* మహానటి సావిత్రి, మెగాస్టార్ చిరంజీవి… ఇలా వేర్వేరు త‌రాల‌కు చెందిన ఇద్ద‌రు అగ్ర తార‌లు న‌టించిన సినిమా `పునాది రాళ్ళు`.
* చిరు కెరీర్‌లో తొలి చిత్రమైన ‘పునాదిరాళ్ళు’… నటి రోజారమణి కెరీర్‌లో 100వ సినిమా కావడం విశేషం.
* చిరులో డాన్సింగ్ స్కిల్స్ చూసిన‌ దర్శకుడు రాజ్ కుమార్… చిరు కోసం ప్రత్యేకంగా ఓ పాటను తెరకెక్కించారు. అలా ప్రారంభమైన చిరు స్టెప్స్ నలభై ఏళ్ళైనా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.

 

[subscribe]

[youtube_video videoid=Q0WrJ6epCl4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − seven =