జూన్ 24 నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్‌లో చ‌ర‌ణ్‌!?

Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,2019 Latest Telugu Movie News, Ram Charan To Join RRR Movie New Schedule Soon, RRR movie updates, RRR Movie schedules, RRR movie details, RRR latest updates, Ram Charan shooting Schedule for RRR movie, RRR Telugu movie latest news
Ram Charan To Join RRR Movie New Schedule Soon

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా… మెరుపువేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే… ఇటీవల ఫ్యామిలీతో హాలిడే ట్రిప్‌కి వెళ్ళొచ్చిన‌ చరణ్… స్వల్ప విరామం తరువాత మళ్ళీ `ఆర్ ఆర్ ఆర్‌` సెట్‌లోకి అడుగుపెట్ట‌నున్నట్టు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న `ఆర్ ఆర్ ఆర్‌` నెక్స్ట్ షెడ్యూల్‌లో చరణ్ పాల్గొనబోతున్నట్టు స‌మాచారం. ఈ షెడ్యూల్‌లో భాగంగా… కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉందట చిత్ర బృందం. ఇప్పటికే… ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తారక్‌పై చిత్రీకరించిన సంగతి తెలిసిందే. సినిమాకి హైలైట్‌గా నిలవనున్న ఈ యాక్షన్ ఎపిసోడ్‌లో దాదాపు 1500 మంది దేశీ, విదేశీ జూనియ‌ర్ ఆర్టిస్టులు పాల్గొన్నట్టు సమాచారం.

చరణ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ నటిస్తున్న ఈ చిత్రంలో… బాలీవుడ్ నటుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నాడు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్‌కు స్వ‌ర‌వాణి కీరవాణి బాణీలు అందిస్తున్నాడు. కొమరం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్న ఈ చిత్రం… వచ్చే సంవత్సరం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

[subscribe]

[youtube_video videoid=I7j2sn7qHuM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − four =