ఓ బేబి ట్రైలర్ రిలీజ్

#OhBabyTrailer, 2019 Latest Telugu Movie News, Oh Baby Movie Latest News, Oh Baby Movie Official Trailer, Oh Baby Movie Theatrical Trailer, Oh Baby Movie Trailer Out Now, Oh Baby Trailer, Samantha New Movie Oh Baby Trailer, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Oh Baby Movie Trailer Out Now

పెళ్లైన తరువాత చాలా సెలక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ సమంత వరుస హిట్లతో దూసుకుపోతుంది. ఇప్పుడు ఓ బేబి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్‌గా తెలుగులో ఓ బేబి టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు తాజాగాా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ విషయానికొస్తే.. సమంత నటన హైలెట్ అని చెప్పొచ్చు. సరదా సన్నివేశాలతో మొదలైన ట్రైలర్ .. ఎమోషన్ సీన్స్ తో పూర్తయింది.

కాగా నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను…సురేష్ ప్రొడక్షన్స్‌, పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్‌, క్రాస్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా ఈ చిత్రంలో నాగ‌శౌర్య‌, ల‌క్ష్మి, రాజేంద్ర ప్ర‌సాద్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఓ అతిథి పాత్ర‌లో అడివి శేష్ కూడా క‌నిపించ‌నున్నాడు.

మరి గ‌త ఏడాది `రంగ‌స్థ‌లం`, `మ‌హాన‌టి`, `యూ ట‌ర్న్‌` వంటి చిత్రాల్లో విభిన్న పాత్ర‌ల‌ను పోషించిన సమంత ఇప్పుడు ఓ బేబి సినిమాలో మరో డిఫరెంట్ రోల్ తో వస్తుంది. మరి ఈ సినిమా సమంతకు ఎలా కలిసొస్తుందో చూద్దాం?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here