తెలుగు – తమిళ ఏర్పాటు వాదన్ని రెచ్చగొడుతున్న భారతీ రాజ

Bharathi Raja raising Telugu Tamil Separation Controversy,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Bharathi Raja Latest News,Director Bharathi Raja Controversy,Bharathiraja Controversy Comments on Telugu Tamil Separation
Bharathi Raja raising Telugu Tamil Separation Controversy

If you want to kill a dog name it mad… అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. అలాగే నీకు గిట్టనివాళ్ళకు కీడు చేయాలి అంటే వాళ్లకు లేని అపవాదు ఏదో అంట గట్టాలి. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో హీరో విశాల్ విషయంలో జరుగుతుంది అదే. తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, నడిగర సంఘం ప్రధాన కార్యదర్శిగా తమిళ చిత్ర రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న విశాల్ మీద ప్రత్యర్థి వర్గాలు చేస్తున్న దుష్ప్రచారం హద్దులు దాటుతుంది. ఈ నెల 23న జరుగనున్న నడిగర్ సంఘం ఎన్నికలలో మరోమారు ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న విశాల్ ను , అతని ప్యానల్ ను ఓడించటం కోసం ప్రత్యర్థి వర్గం ఎన్నుకున్న ఆయుధం “తమిలేతరుడు”.”తమిళుడు కాని విశాల్ తమిళ నటీనటుల సంఘంలో ఎలా పోటీ చేస్తాడు? అసలు తమిళ సంఘంలో ఇతరులకు ఏం పని? వాళ్లందరినీ బయటకు పంపేదాకా నేను నిద్రపోను… నా ప్రాణం ఉన్నంత వరకు అందుకోసం కృషి చేస్తాను”-

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మాటలు మాట్లాడింది కొత్తగా వచ్చిన ఆవేశపరుడైన ఏ యువ నటుడో దర్శకుడో కాదు… దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ డైరెక్టర్ భారతీ రాజా ఇంత అవగాహన లోపంతో, ఇంత బాధ్యతారహితంగా మాట్లాడటం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేసింది.

నడిగర సంఘం కార్యదర్శి పదవిలో విశాల్ సమర్థవంతంగా పనిచేయలేదు అనుకుంటే అతన్ని ఓడించటానికి వేరే మార్గాలు ఉంటాయి. మీ హామీలు మీరు గుప్పించుకోవచ్చు… సభ్యుల నమ్మకాన్ని పొందవచ్చు… అంతేగాని.. ఇలా దిగజారిపోయి ఏర్పాటువాదాన్ని రెచ్చగొట్టడం దురదృష్టకరం.

విశాల్ తమిళుడు కాదు… ఆంధ్రప్రదేశ్ కు చెందిన రెడ్డి కులస్తుడు… ఇక్కడ అతని ఆధిపత్యం ఏమిటి? అని బాహాటంగా భారతీ రాజా, రాధిక వంటివారు మాట్లాడటం చూస్తుంటే వీళ్ళ అజ్ఞాన, అహంకారాలను ఎలా అంచనా వేయాలో అర్థం కావట్లేదు. గత దశాబ్దంన్నరగా విశాల్ తమిళ హీరోగా, ఆయన తండ్రి జీకే రెడ్డి తమిళ నిర్మాతగా ఎదుగుతున్నప్పుడు అతను తెలుగు రెడ్డి అన్న విషయం వీళ్లకు గుర్తుకు రాలేదా? తమిళ నటీనటుల సంఘంలో ఇతరులకు ఏం పని అని అడుగుతున్న వీళ్లు ఇదే ప్రశ్న ఆ రోజున జన్మతః మలయాళీ అయిన ఎంజీఆర్ ను, ఈ రోజున మహారాష్ట్రకు చెందిన రజనీకాంత్ ను ఎందుకు అడగ లేకపోయారు?

తెలుగు తమిళ విభేదాలు లేకుండా మొదటి నుండి స్నేహ హస్తం అందిస్తూ తెలుగు వారి కంటే తమిళ నటీనటులకు, టెక్నీషియన్స్కు మనవాళ్లు ఇస్తున్న గౌరవానికి, ప్రయారిటీకి వాళ్ల నుండి ఇలాంటి ప్రతి స్పందన రావటాన్ని ఎలా చూడాలి? తనకు మాలిన ధర్మానికి పోయే తెలుగు వాడికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే అని సరిపుచ్చుకుందామా? ఆఫ్ట్రాల్ చిత్రపరిశ్రమలోని చిన్న అసోసియేషన్ కు జరుగుతున్న అంతరంగిక ఎన్నికల్లోనే ఇంత చిన్న బుద్ధిని బయట పెట్టుకుంటున్నారు అంటే ముందు ముందు ఈ ఏర్పాటు ధోరణి ఏ పరిణామాలకు దారితీస్తుందో అనే ఆందోళన కలగటం సహజం.

అయితే.. భారతీ రాజా, రాధిక, శరత్ కుమార్ వంటి తమిళ ప్రముఖులు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే నడిగర్ సంఘం అన్నది. 4 దక్షిణ భారత రాష్ట్రాల నటీనటుల సమాఖ్య… అది ఒక్క తమిళ నటీనటులకే సొంతం కాదు. మీరు సొంతంగా తమిళ కుంపటి పెట్టుకో తలుచుకుంటే నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు… అంతే తప్ప నడిగర సంఘంలో ఇతర భాషల వారి అస్తిత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. భారతదేశంలోని గొప్ప దర్శకులలో ఒకడు అంటూ ” తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం” తనను ఘనంగా సన్మానించిన అద్భుత ఘట్టాన్ని అంతలోనే మర్చిపోయి తెలుగు తమిళ వేర్పాటు వాదానికి బీజాలు వేసిన భారతీ రాజా… నీ స్వల్ప, సంకుచిత నైజాన్ని చూసి జాలి పడుతోంది తెలుగు చిత్ర పరిశ్రమ.

ఈ వివాదం అంతా కేవలం ఎన్నికల స్టంట్ వరకే పరిమితం అయితే పరవాలేదు… కానీ ఈ రోజున బీజం పడిన ఈ ఏర్పాటు వాదం ముందు ముందు ముదిరి పాకాన పడితే తమిళ తంబికి తగు రీతిలో కనువిప్పు కలిగించేందుకు తెలుగు చలనచిత్ర సంఘాలు, ప్రముఖులు స్పందించాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − 2 =