సీత ట్రైలర్ రిలీజ్

Latest Telugu Movies News, Sita Movie Trailer, Sita Movie Updates, Sita Telugu Movie Latest News, Sita Telugu Movie Trailer, Sita Trailer, Sita Trailer – Kajal Aggarwal Steals The Show, Sita Trailer Out Now, SitaTrailer, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Sita Trailer Out Now

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సీత. ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా… ఇంత వరకూ రిలీజ్ కాలేదు. అయితే ఇటీవలే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మే 24న సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ‘నా పేరు సీత .. నేను గీసిందే గీత’ అనే ఒకే ఒక్క కాజల్ డైలాగ్ తో ఆమె పాత్ర స్వభావం ఎలాంటిదో చెప్పేశారు. ఈ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈ సినిమాలో మ‌న్నారా చోప్రా, సోనూ సూద్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈసినిమాను అనిల్ సుంక‌ర, కిషోర్ గ‌రిక‌పాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ‘కవచం’ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ కలసి నటిస్తున్న చిత్రమిది. అంతేకాదు ఈ సినిమాలో కాజల్ నెగెటివ్ షేడ్ లో నటిస్తుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలను సీత సినిమా రీచ్ అవుతుందో? లేదో? తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=Ry_4LeMYMLU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =