తెలుగు, తమిళ, హిందీ… ఇలా త్రిభాషా సూత్రంతో కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది అందాల తార తమన్నా. ఓ వైపు గ్లామర్ రోల్స్… మరో వైపు పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ… యాక్టింగ్ కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే… తాజాగా తమన్నా ఓ ఆసక్తికరమైన పాత్రకి ఓకే చెప్పిందని కోలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… విశాల్ కథానాయకుడిగా సుందర్.సి దర్శకత్వంలో ఓ తమిళ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తోంది. అయితే… ఈ పాత్రలో నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయని సమాచారం. మైండ్ గేమ్ నేపథ్యంలో సాగే ఈ కథలో తమన్నా పాత్రే ప్రధాన ఆకర్షణ అని టాక్. ఆసక్తికరమైన విషయేమిటంటే… కెరీర్ ఆరంభంలోనే `కేడి` (2006) (రవికృష్ణ, ఇలియానా హీరోహీరోయిన్లు) అనే తమిళ చిత్రంలో ఇలా నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించి అలరించింది తమ్మూ. మరి… సుదీర్ఘ విరామం తరువాత ఆ తరహా పాత్రలోనే కనిపించనున్న మిల్కీ బ్యూటీకి ఈ సారి ఎలాంటి గుర్తింపు దక్కుతుందో చూడాలి.
[youtube_video videoid=8VSYF73nG6M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: