మల్టీ స్టారర్ మూవీస్ లో నటించేందుకు ఆసక్తి చూపుతున్న విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ తో కలసి నటించిన కామెడీ ఎంటర్ టైనర్ F2 మూవీ ఘన విజయం సాధించింది. వెంకటేష్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది. హీరో నాగ చైతన్య, వెంకటేష్ కాంబినేషన్ లో వెంకీ మామ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వెంకటేష్, మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ మూవీ రూపొందనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో వెంకటేష్, వెంకీ, విక్రమార్కుడు, దుబాయ్ శీను, కిక్, డాన్ శీను, రాజా ది గ్రేట్ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో రవితేజ ప్రేక్షకులను అలరించారు.తమ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునే ఈ ఇద్దరు హీరోలతో మూవీ అంటే ప్రేక్షకులకు, అభిమానులకు పండుగే. అనిల్ సుంకర నిర్మాణ సారథ్యం లో వీరు పోట్ల దర్శకత్వం లో రూపొందనున్న ఈ మూవీ డిస్కషన్స్ జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం
[youtube_video videoid=zrG2PzmMMR0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: