క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుడితో నితిన్ చిత్రం?

Nithiin To Act In Another Love Story,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nithiin New Film News,Nithiin New Movie Updates,Actor Nithiin Next Project Update,Nithiin Next With Another Love Story,Hero Nithiin New Movie News
Nithiin To Act In Another Love Story

యువ క‌థానాయ‌కుడు నితిన్‌కి ప్రేమ‌క‌థా చిత్రాలు బాగా క‌లిసొచ్చాయి. అందుకే… కెరీర్‌లో సింహ‌భాగం విజ‌యాల‌ను ఆ త‌ర‌హా సినిమాల‌తోనే అందుకున్నాడు నితిన్‌. అలాంటి చిత్రాల్లో… `గుండె జారి గ‌ల్లంత‌య్యిందే` ఒక‌టి. ఆరేళ్ళ క్రితం వేస‌వి సెల‌వుల్లో విడుద‌లైన ఈ సినిమా… బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. అలాంటి ఈ ల‌వ‌బుల్ ఫిల్మ్‌తోనే ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు విజ‌య్ కుమార్ కొండా. అయితే… ఫ‌స్ట్ ఫిల్మ్ తో మెప్పించిన ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కి.. రెండో చిత్రం `ఒక లైలా కోసం` మాత్రం అంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేప‌థ్యంలో… భారీ విరామ‌మే తీసుకున్న విజ‌య్ కుమార్‌… ప్ర‌స్తుతం మూడో చిత్రానికి ముస్తాబ‌వుతున్నాడ‌ని టాక్‌. ఈ సారి… త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడు నితిన్‌తోనే మూవీ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే నితిన్‌కి విజ‌య్ కుమార్ ఓ ఆస‌క్తిక‌ర‌మైన ప్రేమ‌క‌థ‌ని వినిపించాడ‌ని… అది న‌చ్చ‌డంతో నితిన్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాక్‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివ‌రాల‌పై ఫుల్ క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

[youtube_video videoid=TfsXxiDGGXk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =