`మ‌న్మ‌థుడు 2`లో అక్కినేని అమ‌ల‌?

Akkineni Amala in Manmadhudu 2?,Manmadhudu 2 Movie Updates,Latest Telugu Movies 2019,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News,Akkineni Amala Act in Manmadhudu 2,Manmadhudu 2 Special Actress,Akkineni Amala and Nagarjuna Act together in Manmadhudu 2
Akkineni Amala in Manmadhudu 2?

అక్కినేని నాగార్జున‌, అక్కినేని అమ‌ల‌… రీల్ లైఫ్ లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోనూ సూప‌ర్ హిట్ జోడీ. పెళ్ళ‌య్యాక సినిమాల‌కు దూర‌మైన‌ అమ‌ల‌… ఆ మ‌ధ్య `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌` (2012) చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషించి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌రువాత అక్కినేని కుటుంబ‌మంతా క‌ల‌సి న‌టించిన `మ‌నం` (2014)లో అతిథి పాత్ర పోషించారు. అనంత‌రం `హ‌మారి అధూరి క‌హానీ` (2015), `కార్వాన్` (2018) వంటి హిందీ చిత్రాల్లోనూ… `కేరాఫ్ సైరా భాను` (2017) అనే మ‌ల‌యాళ చిత్రంలోనూ అమ‌ల క‌నిపించారు. కాగా… ఐదేళ్ళ త‌రువాత తెలుగు తెర‌పై ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నార‌ట అమ‌ల‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే… అక్కినేని నాగార్జున క‌థానాయ‌కుడిగా `మ‌న్మ‌థుడు`కి సీక్వెల్‌గా ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో… అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట అమ‌ల‌. మ‌రి… ఈ వార్త‌ల్లో ఎంత నిజముందో తెలియాలంటే మ‌రికొద్ది రోజులు ఆగాల్సిందే. మార్చి నుంచి ప‌ట్టాలెక్క‌నున్న `మ‌న్మ‌థుడు 2` 60 రోజుల పాటు నిర‌వ‌ధికంగా విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకుని… ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెర‌పైకి రానుంది. మ‌రి… అమ‌ల అతిథి పాత్ర‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన `మ‌నం` నాగ్ కెరీర్‌లో మెమ‌ర‌బుల్ మూవీగా నిల‌చింది. అదే బాట‌లో `మ‌న్మ‌థుడు 2` కూడా వెళుతుందేమో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here