తన సహజ నటనతో యువతరానికి, కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన యువ కథానాయకుడు నాని. ఆ మధ్యంతా పక్కింటి అబ్బాయి తరహా పాత్రల్లో కనిపించిన నాని… ఈ మధ్య తన శైలికి భిన్నంగా సాగే పాత్రలను ఎంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే… గత ఏడాది `దేవదాస్`లో డాక్టర్‌గా కనిపించి అలరించిన ఈ నేచురల్ స్టార్… అప్‌కమింగ్ ప్రాజెక్ట్ `జెర్సీ`లో మధ్యవయస్కుడైన క్రికెటర్ అర్జున్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లోనూ మరో కొత్త తరహా పాత్రలో కనిపిస్తాడట ఈ యంగ్ హీరో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినిపిస్తున్న కథనాల ప్రకారం… నాని తన 24వ చిత్రంలో రైటర్‌గా అవతారమెత్తుతున్నాడని తెలుస్తోంది. కథానుసారం… సరైన నవల రాసి గొప్ప పేరు తెచ్చుకోవాలని కలలు కనే పాత్ర కథానాయకుడిది. ఈ నేపథ్యంలో… ఏడెనిమిది నవలలు రాసిన తరువాత కూడా సరైన గుర్తింపు రాకపోవడంలో నిరాశలో ఉన్న అతనిని… ఓ బృందం కలసి సహాయం కోరుతుంది. అప్పుడు జరిగిన కథే ఈ సినిమాని తెలుస్తోంది. మరి… ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=XWNwrJj7Ybg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: