
ట్యాగ్ · 265 కథనాలు


ఘనంగా ప్రారంభమైన దిల్ రాజు-విజయ్ దేవరకొండ చిత్రం

రెట్రో కోసం విజయ్ దేవరకొండ

VD 14 షూటింగ్ ప్రారంభం కానుంది

కింగ్ డమ్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఈ వారమే

కింగ్ డమ్ డబ్బింగ్ స్టార్ట్ చేసిన విజయ్

కింగ్ డమ్ షూట్ అప్డేట్

రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ టీమ్

VD15 టైటిల్ లీక్ చేసిన దిల్ రాజు

ఎవడే సుబ్రమణ్యం మళ్లీ వస్తోంది

కింగ్ డమ్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్

VD 12 కోసం ఎన్టీఆర్

VD12 టైటిల్ లాక్

రెండు పార్టులుగా 'వీడీ12'.. రిలీజ్ ఎప్పుడంటే?
అల్లు అర్జున్ ఇంటికి సెలబ్రిటీలు

సారంగపాణి జాతకం టీజర్ రిలీజ్

ది గర్ల్ ఫ్రెండ్ కోసం రానున్న విజయ్ దేవరకొండ
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్' ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. వీకెండ్‌లో మాత్రమే కాకుండా, వీక్ డేస్‌లో కూడా ఈ సినిమాకు హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తుండటంతో, చిత్రబృందం నవంబర్ 12న సక్సెస్ మీట్‌ను నిర్వహించాలని నిర్ణయించుకుంది.ఈ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. రేపు ఈ ఈవెంట్ పార్క్ హయత్ లో సాయంత్రం 6 గంటలకు జరుగనుంది.

ఘనంగా ప్రారంభమైన దిల్ రాజు-విజయ్ దేవరకొండ చిత్రం
'కింగ్ డమ్' సినిమా తర్వాత టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా కొత్త చిత్రం షురూ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై 59వ ప్రాజెక్టుగా రూపొందుతోన్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా, మేకర్స్ ఈ చిత్రానికి 'రౌడీ జనార్ధన' అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.

ఇండియా డే పరేడ్‌లో మెరిసిన విజయ్ దేవరకొండ, రష్మిక.. వీడియో వైరల్
అగ్ర రాజ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించిన 43వ 'ఇండియా డే పరేడ్' అత్యంత ఘనంగా జరిగింది. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్' ఆధ్వర్యంలో ప్రతి యేడాది ఈ పరేడ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో “ఇండియా డే పరేడ్” గ్రాండ్‌గా నిర్వహించారు.

రెట్రో కోసం విజయ్ దేవరకొండ
వెర్సటైల్ స్టార్ సూర్య 'కంగువా' తర్వాత హీరోగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'రెట్రో'. సూర్య 44వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను సూర్య తన 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు. ఆయన సరసన కన్నడ భామ పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

VD 14 షూటింగ్ ప్రారంభం కానుంది
యంగ్ హీరో విజయ్ దేవరకొండ వచ్చే నెలలో కింగ్ డమ్ తో రానున్నాడు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో వుంది.ఇప్పటివరకు టీజర్ ను మాత్రమే రిలీజ్ చేశారు.వచ్చే వారం ఫస్ట్ సాంగ్ ను వదలాలని చూస్తున్నారు.ఈసినిమా పై భారీ అంచనాలు వున్నాయి. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తుండగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.మే 30న కింగ్ డమ్ రిలీజ్ కానుంది.

కింగ్ డమ్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఈ వారమే
మచ్ అవైటెడ్ కింగ్ డమ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.వచ్చే నెల 30న థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. వచ్చే వారంలో ఈ సాంగ్ రిలీజ్ కానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తుండడంతో ఆడియో పై భారీ అంచనాలు వున్నాయి.ఈసందర్భంగా నిన్న నాగ వంశీ ట్వీట్ చేశాడు.కింగ్ డమ్ తుపాను ఫస్ట్ సాంగ్ తో స్టార్ట్ కానుంది.ఈవారంలో ఫస్ట్ సింగిల్ డేట్ చెపుతామని అన్నాడు.

కింగ్ డమ్ డబ్బింగ్ స్టార్ట్ చేసిన విజయ్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ మచ్ అవైటెడ్ మూవీ కింగ్ డమ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.అందులో భాగంగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతుంది. విజయ్ నిన్నటి నుండి తన పాత్రకు డబ్బింగ్ చెపుతున్నాడు.ఈరోజు తో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యింది.రేపటి లోగా మొత్తం పూర్తికానుంది.మరోవైపు ఈసినిమా రిలీజ్ వాయిదా పడనుందని రూమర్స్ వస్తున్నాయి. అయితే ఎట్టిపరిస్థితుల్లో సినిమాను అనుకున్న తేదీకి రిలీజ్ చేస్తామని నిర్మాత నాగవంశీ ఇంతకుముందే క్లారిటీ ఇచ్చాడు.త్వరలోనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేయనున్నారు.

కింగ్‌డమ్ టీజర్ కోసం ఎన్టీఆర్‌ని కలిస్తే.. విజయ్ దేవరకొండ
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'కింగ్‌డమ్'. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే దీనికి వివిధ భాషలలో పలువురు స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే.

కింగ్ డమ్ షూట్ అప్డేట్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా కింగ్ డమ్.జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు.రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేయగా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ టైం విజయ్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ లో సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా పూర్తికావొచ్చింది.కొన్ని రోజుల క్రితం ఓ కీలక షెడ్యూల్ కంప్లీట్ కాగా శ్రీలంక లో 5 రోజుల సాంగ్ షూట్ బ్యాలెన్స్ వుంది.ఈనెలలోనే ఈ షూట్ ఫినిష్ కానుంది.ఇందులో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.

రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ టీమ్
బెట్టింగ్ యాప్స్ కోసం హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఆయన టీమ్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని, ఆ కంపెనీలు చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని ఈ సందర్భంగా విజయ్ పీఆర్ టీమ్ తెలియజేసింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని పేర్కొంది.

VD15 టైటిల్ లీక్ చేసిన దిల్ రాజు
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'కింగ్‌డమ్' ప్రస్తుతం సెట్స్ పైన ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా, సూపర్ రెస్పాన్స్ అందుకుంది. సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఎవడే సుబ్రమణ్యం మళ్లీ వస్తోంది
టాలీవుడ్‌లో గడచిన కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల పర్వం జోరుగా నడుస్తోంది. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మరోసారి థియేటర్లలోకి తీసుకురావడానికి ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. ఎందుకంటే ఇటీవలికాలంలో ఈ వ్యవహారం నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. లిమిటెడ్ స్క్రీనింగ్ మరియు షోలు నిర్వహించే డేస్ తక్కువ ఉండటం కూడా దీనికి కలిసొస్తోంది.

కింగ్ డమ్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ -జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కింగ్ డమ్.నిన్ననే టైటిల్ తోపాటు టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.చూసినవారందరి దగ్గరి నుండి యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ టైం విజయ్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ లో కనిపించనున్నాడు. లుక్ కూడా మారింది. టీజర్ లో విజయ్ లుక్ ,అనిరుధ్ బీజీఎమ్ ,విజువల్స్ హైలైట్ అయ్యాయి.తెలుగుతోపాటు , హిందీ , తమిళ భాషల్లో ఈ టీజర్ ఇవ్వగా ఇప్పటివరకు 30 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.

VD 12 టైటిల్, టీజర్ రిలీజ్.. ఎన్టీఆర్, సూర్య వాయిస్ ఓవర్ అదుర్స్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలో తాజాగా ఆయన ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘VD 12’ (వర్కింగ్ టైటిల్) పై విజయ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

VD 12 కోసం ఎన్టీఆర్
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానుంది.సినిమా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క మేజర్ అప్డేట్ కూడా ఇవ్వలేదు.దాంతో ఫ్యాన్స్ అసంతృప్తిగా వున్నారు.ఇక వారికీ కిక్ ఇచ్చే న్యూస్ వచ్చేసింది.ఈసినిమా టైటిల్ తోపాటు టీజర్ ను ఈనెల 12న రిలీజ్ చేయనున్నారు.ఈ టీజర్ కు స్టార్ హీరో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు.పాన్ ఇండియా సినిమా కావడంతో హిందీ టీజర్ కు రన్బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.

VD12 టైటిల్ లాక్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'VD 12' (వర్కింగ్ టైటిల్). 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీలంకలో ఇప్పటికే ఓ లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అనంతరం కేరళలో ఆల్మోస్ట్ వన్ మంత్ నెక్స్ట్ షెడ్యూల్ జరుపుకుంది.

రెండు పార్టులుగా 'వీడీ12'.. రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వీడీ12' (VD12-వర్కింగ్ టైటిల్). 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 80శాతం పూర్తయింది. ప్రచార చిత్రాలతో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ VD12 గురించి అప్‌డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని తెగ ఎదురుచూస్తున్నారు.
అల్లు అర్జున్ ఇంటికి సెలబ్రిటీలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నిన్న అరెస్టైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేయగా.. ఒకరోజు తర్వాత నేడు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం జైలు నుంచి ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

పుష్ప 2 థియేటర్‌లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అలాగే ఈ ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ గత కొన్నేళ్లుగా నెట్టింట స్ప్రెడ్ అవుతున్న వార్తల గురించి కూడా అందరికీ తెలిసిందే. ఏదయినా అకేషన్స్ సందర్భంగా సోషల్ మీడియాలో వీరు షేర్ చేసే కొన్ని ఫోటోలు వైరల్ అవుతుంటాయి.

సారంగపాణి జాతకం టీజర్ రిలీజ్
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'సారంగపాణి జాతకం'. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20వ తేదీన సినిమా విడుదల చేయనున్నారు.