టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘VD 12’ (వర్కింగ్ టైటిల్). ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీలంకలో ఇప్పటికే ఓ లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అనంతరం కేరళలో ఆల్మోస్ట్ వన్ మంత్ నెక్స్ట్ షెడ్యూల్ జరుపుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో VD 12 అప్‌డేట్స్ కోసం విజయ్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ అందించారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. VD 12 టైటిల్ లాక్ చేసినట్టు ప్రకటించారు. త్వరలోనే దీనిని అనౌన్స్ చేయబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
కాగా నిర్మాత నాగవంశీ ట్వీట్ నెటిజన్స్ దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. ఈ అనౌన్స్‌మెంట్ కోసం దేవరకొండ అభిమానులు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. విజయ్ గత చిత్రాలు అనుకున్నంత హిట్ కాకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా పైనే ఉంది. హిస్టారికల్ మూవీగా తెరకెక్కుతుండటం, విజయ్ తొలిసారి ఇలాంటి పాత్రలో కనిపిస్తుండటంతో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
ఇక VD 12 చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హోం బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గ్యాంగ్‍స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా హీరోయిన్ ఎవరనేది అఫీషియల్‌గా ప్రకటించాల్సివుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























