యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా కింగ్ డమ్.జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు.రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేయగా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ టైం విజయ్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ లో సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా పూర్తికావొచ్చింది.కొన్ని రోజుల క్రితం ఓ కీలక షెడ్యూల్ కంప్లీట్ కాగా శ్రీలంక లో 5 రోజుల సాంగ్ షూట్ బ్యాలెన్స్ వుంది.ఈనెలలోనే ఈ షూట్ ఫినిష్ కానుంది.ఇందులో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మే 31న రిలీజ్ కానుంది.ఈసినిమా విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలువనుంది.హిట్ టాక్ వస్తే ఫుల్ రన్ లో 300 కోట్ల సినిమా కానుంది.ఇక ఈసినిమా రెండు భాగాలుగా రానుంది.కథ డిమాండ్ చేయడంతో రెండు భాగాలుగా గా చేస్తున్నామని నాగవంశీ ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో చెప్పాడు.అయితే ఫస్ట్ పార్ట్ కు వచ్చే రెస్పాన్స్ బట్టే సెకండ్ పార్ట్ ఉంటుందని ఆయన అన్నారు.
ఇక విజయ్ కి ఈసినిమా హిట్ కావడం తప్పనిసరి కానుంది.చాలా కాలం నుండి విజయ్ బ్లాక్ బాస్టర్ కోసం ఎదురుచూస్తున్నాడు.ఫ్యాన్స్ అయితే ఈసినిమాతో విజయ్ కం బ్యాక్ ఇస్తాడని బలంగా నమ్ముతున్నారు.మరి ఈసినిమా తో సాలిడ్ హిట్ కొట్టి విజయ్ ఫామ్ లోకి వస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: