టాలీవుడ్‌లో గడచిన కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల పర్వం జోరుగా నడుస్తోంది. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మరోసారి థియేటర్లలోకి తీసుకురావడానికి ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. ఎందుకంటే ఇటీవలికాలంలో ఈ వ్యవహారం నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. లిమిటెడ్ స్క్రీనింగ్ మరియు షోలు నిర్వహించే డేస్ తక్కువ ఉండటం కూడా దీనికి కలిసొస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం పలు హిట్ చిత్రాలను ఇంకోసారి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ఓ స్టోరీ ఓరియెంటెడ్ మూవీ చేరింది. నేచురల్ స్టార్ నాని నటించిన ఎవడే సుబ్రమణ్యం మళ్లీ విడుదలకు సిద్ధంగా ఉంది.
మార్చి 21న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ మేరకు చిత్రాన్ని నిర్మించిన వైజయంతి మూవీస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సంస్థలో అంతకుముందు తీసిన పలు చిత్రాలు ఆశించినమేరకు విజయం అందించలేదు. అలాంటి సమయంలో బ్యానర్ అధినేత చలసాని అశ్వనీదత్ కుమార్తెలు స్వప్న దత్ మరియు ప్రియాంక దత్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దీనిని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకోవడం గమనార్హం.
కాగా హీరో నాని కెరీర్ తొలినాళ్లలో చేసిన ఈ ఫీల్ గుడ్ ఫిల్మ్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించడం విశేషం. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో హీరో నాని తర్వాత ఈ యువ నటుడికి మంచి గుర్తింపు లభించింది. మూవీలో విజయ్ క్యారక్టర్, పర్ఫార్మెన్స్‌కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అలాగే నాని తన అద్భుతమైన నటనతో మరోసారి ప్రేక్షకులను మైమరిపింపజేశారు.
2015 మార్చి 21న విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో తనను తాను అన్వేషించుకునేందుకు హిమాలయాలకు ప్రయాణం చేసే కార్పొరేట్ ఉద్యోగి సుబ్రహ్మణ్యంగా నాని నటించాడు. ఎవరెస్టు శిఖరంపై చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా ఈ మూవీ చరిత్ర సృష్టించింది. మాళవిక నాయర్, రీతు వర్మ ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. అలాగే సీనియర్ నటుడు రెబెల్ స్టార్ కృష్ణంరాజు, నాజర్, వివేక్ ఉపాధ్యాయ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇక ఈ చిత్రం విడుదలై ఒక దశాబ్దం పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను మరోసారి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే 2015లో విడుదలైన మార్చి 21నే ఎవడే సుబ్రహ్మణ్యం రానుండటం గమనార్హం. దీంతో బిగ్ స్క్రీన్ పై ఈ సినిమాను వీక్షించేందుకు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: