VD 12 టైటిల్, టీజర్ రిలీజ్.. ఎన్టీఆర్, సూర్య వాయిస్ ఓవర్ అదుర్స్

VD12 Telugu, Tamil Teasers Released With NTR and Suriya's Voice Overs

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలో తాజాగా ఆయన ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘VD 12’ (వర్కింగ్ టైటిల్) పై విజయ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా అదిరిపోయే అప్‌డేట్స్ అందించింది. మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ మరియు టీజర్ లను రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి ‘కింగ్‌డమ్’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది. అలాగే ఈ క్రేజీ ప్రాజెక్టు విడుదలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. మే 30వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది.

కాగా ఈ మూవీ టీజర్ ను తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్ చేయగా.. దీనికి ఇద్దరు ప్రముఖ హీరోలు వాయిస్ ఓవర్ అందించడం విశేషం. తెలుగు టీజర్ కి స్టార్ హీరో ఎన్టీఆర్.. అలాగే తమిళ్ టీజర్ కి స్టార్ హీరో సూర్య వాయిస్ అందించారు. తమ గంభీరమైన గాత్రంతో హీరో విజయ్ దేవరకొండ పాత్రను పరిచయం చేశారు. మొత్తానికి ఈ టీజర్స్ అయితే అదిరిపోయాయి. సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసాయి.

ఇక VD 12 చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మరియు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హోం బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గ్యాంగ్‍స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ మూవీలో నటించనున్న హీరోయిన్ అలాగే ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.