విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానుంది.సినిమా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క మేజర్ అప్డేట్ కూడా ఇవ్వలేదు.దాంతో ఫ్యాన్స్ అసంతృప్తిగా వున్నారు.ఇక వారికీ కిక్ ఇచ్చే న్యూస్ వచ్చేసింది.ఈసినిమా టైటిల్ తోపాటు టీజర్ ను ఈనెల 12న రిలీజ్ చేయనున్నారు.ఈ టీజర్ కు స్టార్ హీరో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు.పాన్ ఇండియా సినిమా కావడంతో హిందీ టీజర్ కు రన్బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సో ఎన్టీఆర్ వాయిస్ తో విజయ్ దేవరకొండను పరిచయం చేయనున్నారు.సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ పెట్టినట్లు సమాచారం.ఎవరు ఊహించని బ్యాక్ డ్రాప్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.ఇక ఈసినిమా షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుగుతుంది.సాంగ్ షూట్ చేస్తున్నారు.దింతో షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లే. అన్ని కుదిరితే మే లో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. టీజర్ లో రిలీజ్ డేట్ చెప్తారో చూడాలి. హీరోయిన్ ఎవరనేది కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు.గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ -సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఇక ఈసినిమా పై విజయ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.గీత గోవిందం తరువాత విజయ్ కి ఇంతవరకు అలాంటి విజయం దక్కలేదు.అయితే VD 12 తో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: