టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అలాగే ఈ ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ గత కొన్నేళ్లుగా నెట్టింట స్ప్రెడ్ అవుతున్న వార్తల గురించి కూడా అందరికీ తెలిసిందే. ఏదయినా అకేషన్స్ సందర్భంగా సోషల్ మీడియాలో వీరు షేర్ చేసే కొన్ని ఫోటోలు వైరల్ అవుతుంటాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనికితోడు రీసెంట్‌గా పుష్ప 2 వేడుకలో పాల్గొన్న రష్మిక చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. ఈ సందర్భంగా యాంకర్, మీకిష్టమైన వ్యక్తి ఎవరు? అతడు ఇండస్ట్రీ చెందిన వాడేనా? అని అడుగగా.. అతడెవరో అందరికీ తెలుసుని రష్మిక చెప్పింది. దీంతో అతడెవరో కాదు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండే అని అందరికీ దాదాపు క్లారిటీ వచ్చేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి రష్మిక, విజయ్ దేవరకొండ వార్తలో నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. రష్మిక నటించిన పుష్ప 2 సినిమా గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన చిత్రాన్ని వీక్షించేందుకు ఆమె నిన్న అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌కి విచ్చేసింది. అయితే తనతోపాటు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావడం విశేషం.
స్క్రీనింగ్ అనంతరం విజయ్ దేవరకొండ తల్లి మాధవి, సోదరుడు హీరో ఆనంద్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా కలిసి బయటకు వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక బాండింగ్ మరోసారి అందరికీ అర్ధమైంది. అయితే విజయ్ ఫ్యామిలీ, రష్మిక కలిసే వెళ్లారా? లేక అనుకోకుండా థియేటర్‌లో కలిశారా? అనే చర్చ కూడా మరోవైపు నడుస్తోంది. సో.. మొత్తానికి రష్మిక, విజయ్ దేవరకొండలపై గాసిప్స్ ఇప్పట్లో ఆగేలాలేవు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: