టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కింగ్‌డమ్’ ప్రస్తుతం సెట్స్ పైన ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా, సూపర్ రెస్పాన్స్ అందుకుంది. సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో రూపొందనున్న ‘VD14’. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే దీనిని పట్టాలెక్కించనున్నారు. కాగా ఇంతకుముందు రాహుల్ ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ్ రాయ్’ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈ రెండూ సూపర్ హిట్ సాధించాయి. దీంతో ఇప్పుడు తీయబోయే సినిమాపైనా భారీ అంచనాలే ఉన్నాయి.
ఇదిలావుంటే, ఇంకోవైపు విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొత్త చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. వర్కింగ్ టైటిల్ ‘VD15’గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నాడు. ఇంతకుముందు ఆయన తొలిసారి డైరెక్షన్ చేసిన ‘రాజావారు రాణిగారు’ సంచలన విజయం సాధించింది. ఈ మూవీతోనే కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమయ్యాడు.
ఈ నేపథ్యంలో ‘VD15’ కి సంబంధించి సాలిడ్ అప్డేట్ అందింది. చిత్ర నిర్మాత దిల్ రాజు తాజాగా ఈ సినిమా టైటిల్ లీక్ చేశారు. ఈ మేరకు ఆయన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీరిలీజ్ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్‌లో VD15 టైటిల్ వెల్లడించారు. దీనికి ‘రౌడీ జనార్ధన’ అనే పేరు పెట్టనున్నట్టు తెలిపారు. అయితే గతేడాది దిల్ రాజు నిర్మించగా, విజయ్ దేవరకొండ నటించిన ‘ఫామిలీ స్టార్’ చిత్రం నిరాశపరచడంతో ఈసారి గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యారు.
అలాగే నితిన్ హీరోగా తాను నిర్మిస్తున్న చిత్రానికి ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు స్పష్టం చేశారు. దీనికి ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూవీ కోసం వేణు మరోసారి తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఓ యూనిక్ కథను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ క్రేజీ అప్డేట్స్ ఈ సినిమాలపై అంచనాలను పెంచేస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: