ఘనంగా ప్రారంభమైన దిల్ రాజు-విజయ్ దేవరకొండ చిత్రం

Dil Raju Produces Vijay Deverakonda’s Rowdy Janardhana Launched Grandly

‘కింగ్ డమ్’ సినిమా తర్వాత టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా కొత్త చిత్రం షురూ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై 59వ ప్రాజెక్టుగా రూపొందుతోన్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా, మేకర్స్ ఈ చిత్రానికి ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఈ సినిమా శుక్రవారం (అక్టోబర్ 10, 2025) అధికారికంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా నేషనల్ అవార్డు విన్నర్‌ కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ పూజా కార్యక్రమం సందర్భంగా దిల్‌రాజు, రవి కిరణ్ కోలా, విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, మరో నిర్మాత నిరంజన్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. “విజయ్ దేవరకొండ ఎనర్జీకి సరిపోయే స్క్రిప్ట్ ఇది. రవి కిరణ్ చెప్పిన కథ చాలా పాజిటివ్‌గా అనిపించింది. మా బ్యానర్ నుంచి మరో బ్లాక్‌బస్టర్ రాబోతుంది” అని తెలిపారు. అలాగే చిత్ర దర్శకుడు రవి కిరణ్ కోలా మాట్లాడుతూ.. “విజయ్‌కి సరిపోయే ప్యూర్ మాస్, ఎమోషన్‌తో కూడిన కథ ఇది. అభిమానులు తప్పకుండా కనెక్ట్ అవుతారు” అని అన్నారు.

కాగా, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ఈనెల 16 నుండి ప్రారంభమవనుంది. రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘భ్రమయుగం’ ఫేమ్ క్రిస్టో జేవియర్ మ్యూజిక అందిస్తుండగా.. ఆనంద్ సి. చంద్రన్ కెమెరా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, ముంబై, వైజాగ్ తదితర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకోనుంది. ఇక విజయ్ దేవరకొండ–కీర్తి సురేష్ కాంబినేషన్‌ మీద సినిమా ప్రారంభం నుంచే మంచి హైప్‌ నెలకొనగా.. దిల్ రాజు నిర్మాణంలో విజయ్ హీరోగా చేస్తున్న రెండో పిక్చర్ కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.