బెట్టింగ్ యాప్స్ కోసం హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఆయన టీమ్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని, ఆ కంపెనీలు చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని ఈ సందర్భంగా విజయ్ పీఆర్ టీమ్ తెలియజేసింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని పేర్కొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్‌గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ప్రాడక్ట్‌కు చట్టప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్‌కు ప్రచారకర్తగా ఉంటారు. విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న ఒక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు తెలియజేసింది.
అయితే ఆ కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్‌కు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని. ఈ అసత్య వార్తలను ఎవరూ నమ్మవద్దని పేర్కొంది. విజయ్ ఇల్లీగల్‌గా పనిచేస్తున్న ఏ సంస్థకూ ప్రచారకర్తగా వ్యవహరించలేదని టీమ్ తెలిపింది. దీంతో ఇప్పటివరకూ విజయ్ దేవరకొండపై ప్రచారమవుతున్న వార్తలపై ఒక స్పష్టత వచ్చినట్లైంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: