యంగ్ హీరో విజయ్ దేవరకొండ వచ్చే నెలలో కింగ్ డమ్ తో రానున్నాడు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో వుంది.ఇప్పటివరకు టీజర్ ను మాత్రమే రిలీజ్ చేశారు.వచ్చే వారం ఫస్ట్ సాంగ్ ను వదలాలని చూస్తున్నారు.ఈసినిమా పై భారీ అంచనాలు వున్నాయి. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తుండగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.మే 30న కింగ్ డమ్ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాపూర్తి కావడంతో విజయ్ నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడు.ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు వున్నాయి. ఇందులో ఓ సినిమాను టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ తో చేయనున్నాడు విజయ్.రీసెంట్ గా సెట్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రానుంది. మే లేదా జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
అలాగే విజయ్ రాజావారు రాణిగారు ఫేమ్ రవి కిరణ్ కోలాతో కూడా ఓ సినిమా చేయనున్నాడు.దిల్ రాజు నిర్మించనున్నారు.ఆగస్టు లేదా సెప్టెంబర్ నుండి షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు.ఈ రెండు సినిమాలను బ్యాలెన్స్ చేయనున్నాడు విజయ్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























