మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘సారంగపాణి జాతకం’. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20వ తేదీన సినిమా విడుదల చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా సారంగపాణి జాతకం టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, హర్ష చెముడు వినోదం అందర్నీ నవ్విస్తుందని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఇక ‘సారంగపాణి జాతకం’ టీజర్ విషయానికి వస్తే… హీరో జాతకాలను బాగా నమ్ముతాడు.
‘మన జీవితం మొత్తం మన చేతిలోనే రాసి ఉంటుంది’ అని చెబుతాడు. ప్రతిరోజూ ఉదయం పేపర్ చూసి అందులో రాసింది నిజం అవుతుందని నమ్మడమే కాదు, నిజమైన రోజు చుట్టుపక్కల ఎవరున్నారు? ఏం అవుతుంది? అనేది పట్టించుకోకుండా తన సంతోషాన్ని అందరి ముందు వ్యక్తం చేసే యువకుడు. మరి, జాతకాలపై అమితమైన నమ్మకం వల్ల అతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది ఫన్నీగా చూపించారు.
ప్రేమించిన అమ్మాయిని పెళ్లికి సిద్ధమైన మండపంలో ఒకరిని సారంగపాణి ఎందుకు చంపడానికి ప్రయత్నించాడు? నరేష్ ను ఎందుకు కత్తితో పొడిచాడు? అది నిజమా? కలా? అతని జీవితంలో కీచకుడు ఎవరు? కీచకుడిగా తనికెళ్ళ భరణి ఎటువంటి క్యారెక్టర్ చేశారు? సుందరమ్మ మరణిస్తే హీరో ఎందుకు హ్యాపీగా ఫీలయ్యాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
‘మొత్తం మనిషిలో ఆ ఒక్క పార్ట్ గుర్తుందా ఈవిడకి’ – ‘బీ కార్పొరేట్, నాట్ డెస్పరేట్’ అని ‘వెన్నెల’ కిశోర్ చెప్పే డైలాగ్స్ నవ్వించాయి. ‘సారంగం అని ధనుస్సు చేతిలో ఉన్నవాడు సారంగపాణి’, ‘నా దగ్గర విరుగుడు మంత్రాలు, పూజలు, తాయత్తులు ఉండవు’ అని శ్రీనివాస్ అవసరాల, ‘నాలాంటి ప్రాక్టికల్ మనిషికి ఇలాంటి జాతకాల పిచ్చోడు కొడుకుగా ఎలా పుట్టాడే’ అని తండ్రి పాత్రలో వడ్లమాని శ్రీనివాస్, ‘నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా ఆఫీస్’ అంటూ హీరో పదేపదే చెప్పే మాట కథపై క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి.
ఇక ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్ ఇతర ప్రధాన తారాగణం. అలాగే మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పీజీ విందా కాగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: