నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. వీకెండ్‌లో మాత్రమే కాకుండా, వీక్ డేస్‌లో కూడా ఈ సినిమాకు హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తుండటంతో, చిత్రబృందం నవంబర్ 12న సక్సెస్ మీట్‌ను నిర్వహించాలని నిర్ణయించుకుంది.ఈ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. రేపు ఈ ఈవెంట్ పార్క్ హయత్ లో సాయంత్రం 6 గంటలకు జరుగనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రష్మిక , విజయ్ దేవరకొండ ఇద్దరూ ఒకే వేదికపైకి రావడం పట్ల ప్రేక్షకులు, అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇటీవల వీరిద్దరి మధ్య ఎంగేజ్‌మెంట్ గురించి రూమర్లు వచ్చిన నేపథ్యంలో, ఈ వేదికపై వీరి కలయిక మరింత ప్రత్యేకంగా మారింది.
ఇక కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ఈసినిమా అదరగొడుతుంది.నిన్నటి వరకు నార్త్ అమెరికాలో 400K డాలర్ల మార్క్ ను క్రాస్ చేసింది.హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈసినిమాలో అను ఇమ్మాన్యుయెల్ కీలక పాత్రలో నటించింది. గీతా ఆర్ట్స్ ఈసినిమాను నిర్మించింది.
ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా కథ విషయానికి వస్తే, భూమా (రష్మిక మందన్న) అనే అమ్మాయి, తన పీజీ కోసం హైదరాబాద్‌లోని ఒక కాలేజీలో చేరుతుంది. అక్కడే పీజీ చేస్తున్న విక్రమ్ (దీక్షిత్ శెట్టి) ఆమెను ఇష్టపడతాడు. విక్రమ్‌కి జెలసీ, పొసెసివ్‌నెస్ ఎక్కువగా ఉండటం వల్ల వారి రిలేషన్‌షిప్‌లో వచ్చిన సమస్యలు, బ్రేకప్ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథాంశం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























