టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వీడీ12’ (VD12-వర్కింగ్ టైటిల్). ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 80శాతం పూర్తయింది. ప్రచార చిత్రాలతో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ VD12 గురించి అప్‌డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని తెగ ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు చిత్ర నిర్మాత నాగవంశీ. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. “వీడీ12 ప్రాజెక్ట్ రెండు పార్టులుగా వస్తుంది. ఈ ఆలోచన సినిమా తీస్తున్న టైంలో రాలేదు. షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే స్క్రిప్ట్ పనుల్లో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నాం. అయితే ఈ రెండు కథలు దేనికవే సెపరేట్ గా ఉంటాయి.” అని తెలిపారు.
అలాగే వీడీ12 విడుదల గురించి చెబుతూ.. “ఈ మూవీలో మొత్తం 8 సాంగ్స్ ఉంటాయి. వీటిని ఒకేసారి రిలీజ్ చేస్తాం. వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ ఆ టైంలో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ వస్తుందనుకుంటే, మా సినిమాను వాయిదా వేస్తాం” అని వెల్లడించారు నిర్మాత నాగవంశీ. ఇక అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, వచ్చే సమ్మర్ నాటికి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.
ఇక VD12 చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హోం బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గ్యాంగ్‍స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ మూవీలో నటించనున్న హీరోయిన్ అలాగే ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























