యంగ్ హీరో విజయ్ దేవరకొండ -జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కింగ్ డమ్.నిన్ననే టైటిల్ తోపాటు టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.చూసినవారందరి దగ్గరి నుండి యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ టైం విజయ్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ లో కనిపించనున్నాడు. లుక్ కూడా మారింది. టీజర్ లో విజయ్ లుక్ ,అనిరుధ్ బీజీఎమ్ ,విజువల్స్ హైలైట్ అయ్యాయి.తెలుగుతోపాటు , హిందీ , తమిళ భాషల్లో ఈ టీజర్ ఇవ్వగా ఇప్పటివరకు 30 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవరాల్ గా టీజర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచేశారు.షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. ఈనెలలో బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేయనున్నారు.నాగవంశీ , సాయి సౌజన్య నిర్మిస్తుండగా మే 30న రిలీజ్ చేయనున్నారు.ఈసినిమా విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలువనుంది. హిట్ టాక్ వస్తే ఫుల్ రన్ లో 300కోట్ల సినిమా కానుంది.
ఇక విజయ్ కి కింగ్ డమ్ హిట్ తప్పనిసరి కానుంది. చాలా కాలం నుండి విజయ్ బ్లాక్ బాస్టర్ కోసం ఎదురుచూస్తున్నాడు.టీజర్ చూస్తుంటే ఈసినిమా తనకు కావాల్సిన విజయాన్ని ఇచ్చేలానే వుంది.
విజయ్ ఈసినిమా తరువాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు.అందులో రవికిరణ్ కోలా తో ఓ సినిమా చేయనున్నాడు. దిల్ రాజు ఈసినిమాను నిర్మించనున్నారు. అలాగే టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో కూడా సినిమా చేయనున్నాడు.సమ్మర్ నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: