కింగ్ డమ్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఈ వారమే

The first single from Kingdom will be out soon

మచ్ అవైటెడ్ కింగ్ డమ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.వచ్చే నెల 30న థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. వచ్చే వారంలో ఈ సాంగ్ రిలీజ్ కానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తుండడంతో ఆడియో పై భారీ అంచనాలు వున్నాయి.ఈసందర్భంగా నిన్న నాగ వంశీ ట్వీట్ చేశాడు.కింగ్ డమ్ తుపాను ఫస్ట్ సాంగ్ తో స్టార్ట్ కానుంది.ఈవారంలో ఫస్ట్ సింగిల్ డేట్ చెపుతామని అన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఈసినిమా అనుకున్న టైం కు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.విజయ్ దేవరకొండ అయితే డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశాడు.అనిరుధ్ వర్క్ అనుకున్న సమయానికి పూర్తయితే సినిమా చెప్పిన డేట్ కు వస్తుంది.లేదంటే వాయిదా తప్పదు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈసినిమాను తెరకెక్కిస్తుండగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.

ఇక కింగ్ డమ్ ప్రమోషన్స్ అనంతరం విజయ్ తన నెక్స్ట్ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు ప్రస్తుతం విజయ్ చేతిలో మరో రెండు సినిమాలు వున్నాయి. అందులో ఓ సినిమాను రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా తో చేయనున్నాడు.దిల్ రాజు నిర్మించనున్నారు.షూటింగ్ జూన్ నుండి స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఇక అలాగే టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ తో కూడా విజయ్ సినిమా చేయనున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ రెండు వచ్చే ఏడాదే విడుదలకానున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.