ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నిన్న అరెస్టైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేయగా.. ఒకరోజు తర్వాత నేడు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం జైలు నుంచి ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కి స్టార్ నటులు, దర్శకులు, నిర్మాతలు బన్నీకి మద్దతు తెలుపుతున్నారు. అలాగే ఈ స్టార్ హీరోని పరామర్శించేందుకు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. హీరోలు రానా దగ్గుబాటి, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, సుధీర్ బాబు, సీనియర్ నటులు ఉపేంద్ర, ఆర్ నారాయణమూర్తి తదితరులు బన్నీని కలిసినవారిలో ఉన్నారు.
అలాగే స్టార్ డైరెక్టర్స్ రాఘవేంద్రరావు, సుకుమార్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, హరీశ్ శంకర్, రానా దంపతులు, పుష్ప టీమ్ తదితరులు అల్లు నివాసానికి చేరుకొని బన్నిని కలిశారు. ఇంకా నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, బన్నీ వాసు, ఎస్‌కేఎన్ తదితరులు ఐకాన్ స్టార్ ను కలుసుకుని తమ సంఘీభావం తెలియజేశారు.
ఇక మరోవైపు అల్లు అర్జున్ మేనత్త, మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ కూడా విచ్చేశారు. ఆమెను చూసిన వెంటనే ఆయన దగ్గరికి వెళ్లి హగ్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా తనను చూసి భావోద్వేగానికి గురైన మేనత్తను అల్లు అర్జున్ ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: