కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vijay Deverakonda Movies

ట్యాగ్ · 101 కథనాలు · పేజీ 2

vijay deverakonda family star movie glimpse gets super response
ట్రైలర్ & టీజర్

సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ హంగామా

హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఉంటుంది కొంతమంది క్రేజ్. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండకు మాత్రం ఆ క్రేజ్ ఉంది. నిజానికి ఈమధ్య కాలంలో విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కొట్టింది లేదు. అయినా కూడా విజయ్ కు మాత్రం క్రేజ్ వేరే ఉంటుంది. వరుసపెట్టి అవకాశాలు మాత్రం వస్తూనే ఉంటాయి. రీసెంట్ గా ఖుషి సినిమా వచ్చాడు. ఆసినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
kushi movie usa collections update
బాక్సాఫీస్

ఖుషి దూసుకుపోతున్న యూఎస్ఏ కలెక్షన్స్

శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా ఖుషి. సెప్టెంబ‌ర్ 1న రిలీజైన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో సమంత, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ ఇంకా లవ్, కామెడీ యాంగిల్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను అందించింది. ఈ సినిమా ఇప్పటికే తమిళ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే 2023 లో తమిళనాడులో రిలీజ్ అయి అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న తెలుగు మూవీగా ఖుషి నిలిచింది.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Visits Yadadri Temple Along With Family Members and Kushi Movie Team
సినిమా వార్తలు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో 'ఖుషి' మూవీ టీమ్

టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ 'ఖుషి' మూవీ టీమ్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఈ ఉదయం దర్శించుకున్నారు. ఖుషి సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ క్రమంలో హీరో విజయ్ దేవరకొండ తన తల్లిదండ్రులు, సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండలతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. అలాగే 'ఖుషి' చిత్ర దర్శకుడు శివ నిర్వాణ మరియు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు, పూజారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Srikanth Mవాట్సాప్
kushi telugu movie review
రివ్యూ

రివ్యూ :ఖుషి

ఓవరాల్ గా ఖుషిలో విజయ్ దేవరకొండ ,సమంత నటన అలాగే చివరి 30నిమిషాలు,సాంగ్స్ హైలెట్ అయ్యాయి.ఇక విజయ్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సాలిడ్ హిట్ ను కూడా ఈ ఖుషి ఇచ్చేసింది.ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఈసినిమా చూసేయొచ్చు.

Mahender Reddyవాట్సాప్
kushi completes censor formalities
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ఖుషి

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ,ట్రైలర్ తో సినిమాకు మంచి హైప్ వచ్చింది.దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనూ అదరగొట్టింది.ప్రస్తుతం విజయ్ ఈసినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.తెలుగుతోపాటు మిగితా భాషల్లో కూడా విడుదలవుతుండడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నాడు.ఇక ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు ఈసినిమాకు యు/ఏ సర్టిఫికెట్ జారీచేసింది.అయితే ఖుషికి రన్ టైం కొంచెం ఎక్కువగానే వుంది.దాదాపు 2గంటల 45నిమిషాల నిడివితో రానుంది.

Mahender Reddyవాట్సాప్
Vijay Deverakonda Interesting Comments on Megastar Chiranjeevi and Superstar Rajinikanth
సినిమా వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌లపై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ నటులలో యూత్‌లో మాంచి క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. ఆయన సినిమాలు చూసి అభిమానులైన వారికంటే తన యాటిట్యూడ్ చూసి అభిమానులైనవారే ఎక్కువగా ఉంటారు. కార్యక్రమం ఏదైనా.. సందర్భం ఏదైనా.. నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించడానికి విజయ్ ఎప్పుడూ వెనుకాడరు. తాజాగా ఆయన మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌లను ఉద్దేశించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవి, రజినీకాంత్ ఇద్దరూ సూపర్ స్టార్స్ అని, వాళ్ళకి జయం, అపజయం అనేవి చాలా సాధారణ పదాలని పేర్కొన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ రెండింటికన్నా ఇంకా ఎక్కువని చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. సమంతతో కలిసి విజయ్ చేసిన కొత్త సినిమా 'ఖుషి'…

Srikanth Mవాట్సాప్
intresting story back drop for VD 12
సినిమా వార్తలు

గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో VD 12

యంగ్ హీరో విజయ్ దేవరకొండ,జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఈసినిమా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది.ఓ అండర్ కవర్ కాప్,గ్యాంగ్ స్టర్స్ ను ఎలా అంతమొందించాడు అనే పాయింట్ తో రానుందట.ఇందులో విజయ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.కెరీర్ లో మొదటి సారి విజయ్ ఫుల్ టైం యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Samantha Ruth Prabhu Promises Fans A Grand Return From Her at Kushi Movie Musical Concert
సినిమా వార్తలు

'ఖుషి' మ్యూజిక్ కాన్సర్ట్‌లో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ నటి సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం 'ఖుషి'. రోమ్‌ కామ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌, సమంత భార్య, భర్తలుగా నటించారు. సెప్టెంబర్ 1న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన 'ఖుషి' మూవీ మ్యూజికల్ కాన్సర్ట్‌లో హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ సమంత హాజరయ్యారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. 'హల్లో హైదరాబాద్, ఈ సినిమా కోసం చాలా ఓపికగా ఎదురు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అభిమానులు ఇక్కడ ప్రత్యక్షంగా పాటలను చూసి ఎంజాయ్ చేయడాన్ని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరితో కలిసి ఈ సినిమా…

Srikanth Mవాట్సాప్
Vijay Deverakonda Emotional Speech About Actress Samantha at Kushi Movie Musical Concert
సినిమా వార్తలు

సమంత ముఖంలో నవ్వులు చూడాలని ఉంది - విజయ్ దేవరకొండ

నటి సమంత ముఖంలో నవ్వులు చూడాలని ఉందని అన్నారు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఈ మేరకు ఆయన మంగళవారం (ఆగస్టు 15, 2023) హైదరాబాద్‌లో జరిగిన 'ఖుషి' మూవీ మ్యూజికల్ కాన్సర్ట్‌లో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. వీరిద్దరూ కలిసి 'ఖుషి' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన 'ఖుషి' మూవీ మ్యూజికల్ కాన్సర్ట్‌లో హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ సమంత హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న నా తరుపున ఖుషి తీసుకొస్తున్నా. చివరిగా అందరికీ ఖుషి…

Srikanth Mవాట్సాప్
kushi trailer gets super response
ట్రైలర్ & టీజర్

ఖుషి ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

విజయ్ దేవరకొండ,సమంత కలిసి నటించిన ఖుషి మరో మూడు వారాల్లో థియేటర్లోకి రానుంది.పోస్టర్లు ,సాంగ్స్ సినిమాఫై హైప్ క్రీయేట్ చేయగా నిన్న విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది.యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో ఖుషి,విజయ్ కి కావాల్సిన విజయాన్ని అందిస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.ఇక ఈట్రైలర్ 24గంటల్లో కోటికి పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
vijay deverakonda interesting comments on samantha
సినిమా వార్తలు

తన కోసం 10 ఏళ్లు అయినా వెయిట్ చేసేవాళ్లం

ఆమె కోసం పదేళ్లయినా వెయిట్ చేసేవాళ్లం అంటున్నారు ఖుషి చిత్రయూనిట్. మరి ఇంతకీ ఆమె ఎవరో ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. ఎవరో కాదు స్టార్ హీరోయిన్ సమంత. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా వస్తున్న సినిమా ఖుషి. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అన్నప్పుడే ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలను ఏర్పడ్డాయి. అందులోనూ అప్పటికే మహానటి సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడటంతో ఈసినిమాను ఎప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
kushi trailer out now
ట్రైలర్ & టీజర్

ఖుషి ట్రైలర్ రిలీజ్

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖుషి ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.రీసెంట్ గా విడుదలైన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ కావడంతో సినిమాఫై హైప్ క్రియేట్ చేయగా తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలకు తగ్గట్లుగా వుంది.విప్లవ్,ఆరాధ్యల ప్రేమ ఆతరువాత వారి వైవాహిక జీవితం చుట్టూ తిరిగే కథతో వస్తుంది ఖుషి.విప్లవ్ పాత్రలో విజయ్ దేవరకొండ,ఆరాధ్య పాత్రలో సమంత నటించారు.వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాలో హైలైట్ కానుంది.ట్రైలర్ లో మాత్రం విజయ్,సమంత ల లుక్ అదిరిపోయింది.విజువల్స్ చాలా బాగున్నాయి.ట్రైలర్ చూస్తుంటే ఈసినిమాతో సాలిడ్ హిట్ కొట్టి విజయ్ మళ్ళీ ట్రాక్ లోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
kushi title song out now
సాంగ్

ఖుషి టైటిల్ సాంగ్ రిలీజ్

విజయ్ దేవరకొండ,సమంత జంటగా తెరకెక్కుతున్న చిత్రం ఖుషి.షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.ఈసినిమా నుండి ఇంతకుముందు విడుదలైన రెండు సాంగ్స్ చార్ట్ బాస్టర్ అయ్యాయి.మొదటి పాట నా రోజా నువ్వే అయితే అన్ని భాషల్లో కలిపి 100మిలియన్ల వ్యూస్ ను రాబట్టి రికార్డు సృష్టించింది.సెకండ్ సాంగ్ ఆరాధ్య కూడా సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.ఇక ఇప్పుడు మూడో సాంగ్ గా ఖుషి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
shiva nirvana kushi movie title song promo released
సాంగ్

ఖుషి టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్

శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. మజిలీ సినిమా తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమా.. మహానటి సినిమా తరువాత సమంత-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమపై మొదటి నుండి మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. సెప్టెంబర్ 1వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
kushi movie title song release date fixed
సాంగ్

ఖుషి టైటిల్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది

TFN Adminవాట్సాప్
vijay devarakonda will be chief guest for baby movie success
సినిమా వార్తలు

బేబి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కి రౌడీ హీరో

ఎలాంటి అంచనాాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొడుతున్న సినిమాలు ఈమధ్య కాలంలో చాలా ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో సినిమా చేరిపోయింది. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా బేబి. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈసినిమా యూత్ ను బాగా ఆకట్టుకోవడంతో ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ , వైష్ణవి ల నటన, కథ, సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నేటి జనరేషన్ లో లవ్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చూపించారు. దీంతో సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
kushi shooting wrapped up
షూటింగ్ అప్‌డేట్

ఖుషి షూటింగ్ కంప్లీట్

లైగర్ తరువాత విజయ్ దేవరకొండ,ఖుషితో ప్రేక్షకులముందుకు రానున్నాడు.ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ నేటితో పూర్తయింది.ఈసందర్బంగా చిత్ర బృందం విజయ్ దేవరకొండ చేత కేక్ కట్ చేయించారు.ఇక ఈసినిమాకు సాంగ్స్ ద్వారానే మంచి బజ్ క్రియేట్ అవుతుంది.ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన నా రోజే నువ్వే సాంగ్ పెద్ద హిట్ అవ్వగా మూడు రోజుల క్రితం విడుదలైన ఆరాధ్య సాంగ్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Mahender Reddyవాట్సాప్
kushi second single out now
సాంగ్

ఖుషి నుండి సెకండ్ సాంగ్ రిలీజ్

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ,సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.ఈసినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఈసినిమా నుండి రీసెంట్ గా విడుదలైన మొదటి పాట నా రోజా నువ్వే సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.తెలుగు వెర్షన్ సాంగ్ యూట్యూబ్ లో 61మిలియన్ల వ్యూస్ రాబట్టుకుంది.ఇక ఇప్పుడు రెండో పాటను కూడా విడుదలచేశారు.ఆరాధ్య అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ కూడా క్యాచీ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
kushi movie second single Aradhya song promo out now
సాంగ్

ఖుషి నుండి ఆరాద్య సాంగ్ ప్రోమో రిలీజ్

శివ నిర్వాణ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఖుషి. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శివ నిర్వాణ. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. సెప్టెంబర్ 1వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
vijay devarakonda 13th movie shooting update
షూటింగ్ అప్‌డేట్

VD13 లోకేషన్ వేట అయింది.. షూట్ కు రెడీ

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ హిట్ కొట్టి రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా హిట్లను అందుకున్నాడు. అయితే ఈమధ్య కాలంలో విజయ్ కు సరైన హిట్ పడలేదు. దీంతో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో పరుశురామ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం 13 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను చేయనున్నారు. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. యూఎస్ఏ లో లోకేషన్స్ వేట పూర్తయింది.. షూటింగ్ ను…

TFN Adminవాట్సాప్

షేర్