ప్రముఖ నటి సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. రోమ్ కామ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్, సమంత భార్య, భర్తలుగా నటించారు. సెప్టెంబర్ 1న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ‘ఖుషి’ మూవీ మ్యూజికల్ కాన్సర్ట్‌లో హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ సమంత హాజరయ్యారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘హల్లో హైదరాబాద్, ఈ సినిమా కోసం చాలా ఓపికగా ఎదురు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అభిమానులు ఇక్కడ ప్రత్యక్షంగా పాటలను చూసి ఎంజాయ్ చేయడాన్ని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరితో కలిసి ఈ సినిమా చూడాలని ఉంది. మేము మంచి సినిమా తీయాలనే ప్రయత్నం చేస్తాము, ఈ ‘ఖుషీ’తో అలాంటి మంచి సినిమా తీశామని నమ్ముతున్నాం’ అని అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సందర్భంగా సమంత ఖుషి సినిమాలో తనకు జోడీగా నటిస్తోన్న హీరో విజయ్ దేవరకొండ మరియు దర్శకుడు శివ నిర్వాణలను ఉద్దేశించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఇక శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ ఇడ్లీ బిజనెస్ సరిగా చేస్తారో లేదో నాకు డౌట్, కానీ వాళ్లిద్దరూ తీసే బ్లాక్ బస్టర్ సినిమా మీద అయితే అస్సలు డౌట్ లేదు. అయితే దేవుడి దయవల్ల సమంత విజయవాడలో ఇడ్లీ స్టాల్ పెట్టుకునే పరిస్థితి రాలేదు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నాకు ఎంతో సహకారం అందించిన నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎన్ని కష్టాలు ఎదురైనా మీ అందరికోసం ఆరోగ్యంగా తిరిగొస్తా. ఈసారి అభిమానులకు బ్లాక్ బస్టర్ హిట్ గిఫ్ట్ గా ఇస్తా’ అని భావోద్వేగంగా ప్రసంగించింది. అయితే సమంత ఈ వ్యాఖ్యలు చేయడం సినిమా అభిమానులతో పాటు పలువురిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఎందుకు అలా మాట్లాడిందో ఎవరికీ అర్ధం కాలేదు. బహుశా ఇటవల ఆమె పరిస్థితిపై సాంఘీక మాధ్యమంలో ఎవరైనా ఏమైనా కామెంట్స్ చేశారా? దానికి ఆమె ఇలా బదులిచ్చిందా? అనేది తెలియదు. ఏదేమైనా సమంత వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా తెలుగు సినిమాలకు సంబంధించి ఒక మూవీ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇలాంటి మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో ఈ సినిమాలోని పాటలను సింగర్స్ లైవ్ లో పాడారు. అలాగే ఇందులోని ఒక పాటకి విజయ్ దేవరకొండ, సమంత కలిసి డాన్స్ చేయడం విశేషం. దీంతో కార్యక్రమానికి వచ్చిన అభిమానుల కేరింతలతో ఆడిటోరియం హోరెత్తింది. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. కాగా శివ ఇంతకుముందు ‘నిన్ను కోరి’ మరియు ‘మజిలీ’ సినిమాలకు దర్శకత్వం వహించిన విషయం విదితమే. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇటీవలే రిలీజ్ చేసిన మూవీ ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యేర్నేని, వై రవి శంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: