VD13 లోకేషన్ వేట అయింది.. షూట్ కు రెడీ

vijay devarakonda 13th movie shooting update

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ హిట్ కొట్టి రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా హిట్లను అందుకున్నాడు. అయితే ఈమధ్య కాలంలో విజయ్ కు సరైన హిట్ పడలేదు. దీంతో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో పరుశురామ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం 13 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను చేయనున్నారు. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. యూఎస్ఏ లో లోకేషన్స్ వేట పూర్తయింది.. షూటింగ్ ను మొదలుపెట్టనున్నాం.. మరిన్ని అప్ డేట్స్ కోసం ఎదురుచూడండి అంటూ పోస్ట్ చేశారు. కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్న ఈసినిమాను ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఈసినిమాతో పాటు రీసెంట్ గానే తన 12వ సినిమాను మొదలుపెట్టాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. శ్రీలీల ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.