యంగ్ హీరో విజయ్ దేవరకొండ ,సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.ఈసినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఈసినిమా నుండి రీసెంట్ గా విడుదలైన మొదటి పాట నా రోజా నువ్వే సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.తెలుగు వెర్షన్ సాంగ్ యూట్యూబ్ లో 61మిలియన్ల వ్యూస్ రాబట్టుకుంది.ఇక ఇప్పుడు రెండో పాటను కూడా విడుదలచేశారు.ఆరాధ్య అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ కూడా క్యాచీ గా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి సాంగ్ ను రాసిన డైరెక్టర్ శివ నిర్వాణనే ఈ రెండో సాంగ్ కి కూడా లిరిక్స్ అందించాడు.ప్రముఖ గాయకులు సిద్ శ్రీరామ్,చిన్మయి ఈసాంగ్ ను పాడగా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు.ఇప్పటివరకు విడుదలైన రెండు సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
If the beautiful married life was a melody 🎵
It would be the #Kushi Second Single #Aradhya ❤️
Listen Now 🎧
– https://t.co/37NIrxDH1I🎤 @sidsriram @Chinmayi
✍️ @ShivaNirvana @TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @saregamasouth pic.twitter.com/E0tMjYH5JE— Mythri Movie Makers (@MythriOfficial) July 12, 2023
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో సెప్టెంబర్ 1న విడుదలకానుంది.ఇక ఈసినిమా విజయం విజయ్ దేవరకొండకు కీలకం కానుంది.గత ఏడాది భారీ అంచనాలతో వచ్చిన లైగర్ నిరాశపరచడంతో విజయ్,ఖుషి మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: